ఉప ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అధికారంలోకి వచ్చిన చరిత్రే లేదు

అందరూ భావించినట్టుగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపినాథ్ మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపినాథ్ భార్య సునీతకు టికెట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నవీన్ యాదవ్‌ మరోసారి టికెట్ దక్కించుకున్నారు. రెండు పార్టీలు కూడా నువ్వా నేనా అన్నట్టుగానే ఎన్నికల్లో ప్రచారం నిర్వహించాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ సీటును దక్కించుకుంది.

అయితే తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా ఓ సెంటిమెంట్ కొనసాగుతూ వస్తోంది. గత కొంతకాలంగా జరిగిన ఉప ఎన్నికలను ఓ సారి పరిశీలిస్తే..అధికారంలో ఉన్న పార్టీలు మాత్రమే మెజార్టీ విజయాలు సాధిస్తున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం కూడా ఒకటి ఉంది. ఉప ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీలు తిరిగి అధికారంలోకి రావడం లేదు. 2014 నుంచి జరిగిన ఉప ఎన్నికలను పరిశీలిస్తే.. ఇది స్పష్టం అవుతోంది. ఏపీలో నంద్యాల స్థానానికి జరిగిన ఉప ఎన్నిక అప్పట్లో పెద్ద సంచలనమే అని చెప్పాలి.

Jubilee Hills Win Will the By-Election Sentiment Reverse Congress s Fortune A BRS Advantage

భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ తన సర్వశక్తులూ ఒడ్డి మరీ వైసీపీపై విజయం సాధించింది. కానీ ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓటమి పాలైంది. జగన్ అధికారంలో ఉన్న సమయంలో తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా..వైసీపీ విజయం సాధించింది. కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా 11 సీట్లకే పరిమితం అయింది.

ఇక తెలంగాణ విషయానికి వస్తే..మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కూడా ఇదే సెంటిమెంట్ రిపీట్ అయింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ప్రేక్షక పాత్ర పోషించింది. బీజేపీ అధికార బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా పోరాడాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందింది.

తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 24,000 ఓట్లపైగా మెజార్టీతో విజయం సాధించారు. ఈ విజయంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఈ ఉప ఎన్నిక సెంటిమెంట్ కాంగ్రెస్‌ను భయపెడుతోంది. ఉప ఎన్నిక సెంటిమెంట్ రిపీట్ అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం కష్టమే. ఈ లెక్కన చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ తిరిగి విజయం సాధించడం పక్కా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+