గద్వాల కోసం రాజీనామా: 'డీకె అరుణ మెలిక, ఉప ఎన్నిక భయం'
గద్వాల్: గద్వాల జిల్లాను కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ చేసిన రాజీనామాలో నిజాయితీ లేదని మంత్రి జూపల్లి కృష్ణా రావు శనివారం నాడు విమర్శించారు. గద్వాలను జిల్లాను చేస్తేనే తన రాజీనామాను ఆమోదించాలని ఆమె షరతు పెట్టడంలోనే నిజాయితీ తెలిసిపోతోందన్నారు.
గద్వాల జిల్లా కావాలని ఉంటే ఆమె షరతులు లేకుండా రాజీనామా పత్రాన్ని ఇచ్చేవారని చెప్పారు. వచ్చే ఉప ఎన్నికల్లో గెలుస్తానో లేదో అనే భయంతోనే ఆమె గద్వాలను జిల్లాగా ప్రకటిస్తేనే తన రాజీనామాను ఆమోదించాలని మెలిక పెట్టారని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రం కోసం విద్యర్థులు బలిదానాలు చేసుకున్న సమయంలో తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ముందుకు రాని అరుణ ఇప్పుడు.. గద్వాలను జిల్లాగా ప్రకటించాలని రాజీనామా చేయడం విడ్డూరమన్నారు.
అయితే, ఆమె రాజీనామా చేసిందే గద్వాలను జిల్లాగా చేయాలని. గద్వాలను జిల్లాగా చేసేందుకు తాను అడ్డు అని కొందరు చెబుతున్నారని, జిల్లాగా చేసేందుకు తాను అడ్డు అయితే తాను రాజీనామా చేస్తానని చెప్పారు. అందులో భాగంగానే షరతులు విధిస్తూ రాజీనామా చేశారని అంటున్నారు. ఆమె రాజీనామా చేసిందే జిల్లా కోసం అయినప్పుడు షరతులు విధించడాన్ని తప్పుపట్టడం ఏమిటని అంటున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications