తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్

తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుజయ్ పాల్‌కు సీజేగా బాధ్యతలు అప్పగిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే బాంబే హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు.

1964 జూన్ 21న జన్మించిన జస్టిస్ సుజయ్‌పాల్ బీకాం, ఎంఏ, ఎల్ఎల్బీ పూర్తి చేసి 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. పలు బ్యాంకులు, మానవ హక్కుల కమిషన్ బోర్డుకు సేవలు అందించారు. 2011 మే 27న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా.. 2014 ఏప్రిల్ 14న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

Justice Sujoy Paul as CJ of Telangana High Court

2024, మార్చి 21న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుతో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. తాజాగా, హైకోర్టు సీజేగా ఆయన నియమితులయ్యారు.

కాగా, జస్టిస్ అలోక్ అరాధేను బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొలీజియం సిఫారసుకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం.. ఆయనను బాంబే హైకోర్టుకు సీజేగా బదిలీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+