అజహరుద్దీన్‌తో ఎఫైర్?: ఆగ్రహంతో ఊగిపోయిన గుత్తా జ్వాల

న్యూఢిల్లీ: భారత స్టార్ షెట్లర్ జ్వాల గుత్తాకు కోపం తెప్పించింది ఓ ప్రశ్న. భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్‌తో మీకు సంబంధం(ఎఫైర్) ఉందంట నిజమేనా? అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు గుత్తా జ్వాల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

సూరత్‌లో ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సమయంలో గుత్తా జ్వాలకు ఈ ప్రశ్న ఎదురైంది. అజహరుద్దీన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అవన్నీ అసత్య ఆరోపణలను అన్నారు.

అవాస్తవమైన ఆరోపణలను పట్టుకుని పదే పదే ఎందుకు ప్రశ్నిస్తున్నారంటూ గుత్తా జ్వాల ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనే ఇవన్నీ అసత్య ఆరోపణలని చెప్పేశాననని గుర్తు చేశారు.

కాగా, అజహరుద్దీన్‌ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అజహరుద్దీన్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ నటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+