సిఎం కెసిఆర్ కాన్వాయ్‌లో ‘ఫైర్ ఫైటర్’(ఫొటోలు)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు భద్రతపై రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబి) హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ అనుమతితో ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో ఒక ప్రత్యేక వాహనాన్ని నిఘావిభాగం అధికారులు చేర్చారు.
ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన సందర్భంగా భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ప్రత్యేక వాహనాన్ని తయారు చేయించింది. దీనిని బుల్లెట్‌ప్రూఫ్ ఫైర్‌ఫైటర్‌గా నామకరణం చేసింది. ఈ వాహనాన్ని ముఖ్యమంత్రి కాన్వాయ్ ముందుభాగంలో నడుపనున్నారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు బిడిఎల్ సంస్థతో ప్రత్యేకంగా తయారు చేయించారు.

ఈ వాహనంలో ఆరుగురు భద్రతాసిబ్బంది ప్రయాణించే అవకాశం ఉది. వీరు అన్ని వైపులనుంచి శత్రువుల దాడిని ఎదుర్కొనే ఏర్పాట్లు ఈ వాహనంలో ఉన్నాయి. ఈ వాహనం ఫైర్‌ప్రూఫ్‌తోపాటు మైన్ ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్ కూడా ఉండడంతో ఎంతటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొంటుందని భద్రతాధికారి ఒకరు తెలిపారు.













Click it and Unblock the Notifications