పాల్ .. ఇదేం పని : స్పాన్సర్‌షిప్ లెటర్ పేరుతో మోసం
హైదరాబాద్ : ఆయనో పార్టీ అధినేత .. ఎన్నికల్లో గెలవకున్నా ... ప్రజలందరికీ సుపరిచితం. చెప్పేవి శ్రీరంగ నీతులు ... కానీ చేసే పనులు మాత్రం వెలుగులోకి వస్తున్నాయి. ఓ అభాగ్యురాలికి స్పాన్సర్‌షిప్ లెటర్ ఇస్తానని రూ. 2 లక్షలు తీసుకొని .. ఆమె నంబర్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టాడు. దీంతో అతనిపై పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది బాధితురాలు.
విజిటి వీసా స్పాన్సర్‌షిప్ లెటర్ కోసం ..
రామచంద్రాపురానికి చెందిన సత్యవతి అమెరికా వెళ్లేందుకు విజిట్ వీసా కోసం ప్రయత్నించారు. ఇంతలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ను ఆశ్రయించారు. తనకు స్పాన్సర్‌షిప్ లెటర్ ఇవ్వమని కోరితే .. డబ్బులు డిమాండ్ చేశాడు పాల్. ఈ డీల్‌లో జ్యోతి, విజయ్ రంగప్రవేశం చేశారు. రూ.15 లక్షలు ఇవ్వాలని షరతు విధించాడు. అంత ఇచ్చుకోలేని చెప్పడంతో వారితో రూ.2 లక్షలకు డీల్ కుదిరింది. చెప్పినట్టు రూ.2 లక్షల చెక్ ఇచ్చారు సత్యవతి. చెక్ తీసుకొని బ్యాంకు డ్రా చేసిన పాల్ .. తర్వాత స్పాన్సర్‌షిప్ లెటర్ సంగతి మరచిపోయాడు.

బ్లాక్‌లిస్టులో ఫోన్ నంబర్
తాను అమెరికా వెళ్లేందుకు స్పాన్సర్‌షిప్ లెటర్ కోసం కేఏ పాల్‌ను కలిసింది సత్యవతి. రేపు, మాపు అని చెప్పి కాలం వెళ్లదీశాడు. తర్వాత ఫోన్లు కూడా చేసింది. కొద్దిరోజులు ఫోను లిప్ట్ చేసిన పాల్ .. సత్యవతి ఫోన్ బ్లాక్ లిస్టులో పెట్టాడు. దీంతో తాను మోసపోయానని సత్యవతి గ్రహించింది. ఇవాళ పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో పాల్ అండ్ కో పై ఫిర్యాదు చేసింది. సత్యవతి కేసు నమోదు చేసి .. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications