జగదీశ్ రెడ్డిని బర్తరఫ్ చేయండి, సీఎం ఆలస్యంగా స్పందించడం దారుణం : ఇంటర్ బోర్డు అవకతవకలపై కేఏ పాల్
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు వ్యవహారంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైనశైలిలో స్పందించారు. 20కి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నాక కానీ సీఎం కేసీఆర్ స్పందిచకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు నైతిన బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

రూ.కోటి ఇవ్వండి
విద్యార్థుల ఆత్మహత్యలపై పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన విద్యార్థులను తిరిగి తీసుకురాలేమని .. కానీ ఆయా కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. ఒక్కో కుటుంబానికి రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆందోళనకు మద్దతు
ఇంటర్ బోర్డు అవకతవకలపై విపక్షాల ఆందోళనకు ప్రజాశాంతి పార్టీ మద్దతిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులకు న్యాయం జరగకుంటే బోర్డు ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరించారు కేఏ పాల్.












Click it and Unblock the Notifications