Prajnan: బాలీవుడ్‍లో అదరగొట్టిన కరీంనగర్ యువకుడు..
కరీంనగర్ జిల్లాకు బాలీవుడ్ కు ఎప్పటి నుంచో సంబంధం ఉంది. బాలీవుడ్ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జయరాజ్ కరీంనగర్ వాస్తువ్యులే. భారత కోకిల సరోజినీ నాయుడు జైరాజ్ కు మేనత్త అవుతారు. ఈయన 1909 సంవత్సరం సెప్టెంబరు 28న కరీంనగర్ లో జన్మించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన జైరాజ్ హైదరాబాద్ నిజాం కాలేజీలో చదివి సినిమాలపై మోజుతో 1929లో ముంబాయి చేరుకున్నారు.
తన 20వ యేటా 1930 లో తొలిసారిగా " స్పార్క్లింగ్ యూత్ " అనే మూకీ చిత్రంలో నటించారు. అదే సంవత్సరంలో " ట్రయంఫ్ ఆఫ్ లవ్ " అనే చిత్రంలో కథానాయకునిగా నటించారు. జైరాజ్ మొత్తం 11 మూకీ చిత్రాల్లో నటించారు. 1931 లో ప్రారంభమైన టాకీ యుగంలో ఆయన " షికారి " ఉర్దూ చిత్రంతో టాకీల్లో ప్రవేశించారు. తర్వాత కాలంలో శాంతారాం, పృధ్వీరాజ్ కపూర్ లాంటి పెద్ద హీరోల సరసన మరో పెద్ద హీరోగా పేరు తెచ్చుకున్నారు. నిరూపా రాయ్, శశికళ, దేవికారాణి, మీనాకుమారి లాంటి హీరోయిన్ ల సరసన నటించారు. అనేక విజయాలనూ చవిచూశారు.

'మూకీ' సినిమా రోజులలో 11 సినిమాలలో తరువాత సుమారు 156 'టాకీ' సినిమాలలో కథానాయకుడిగా, విలక్షణమైన నటుడిగా పలు వైవిధ్యమైన పాత్రలు పోషించారు. హిందీ, ఉర్దూ భాషలతో పాటు, కొన్ని మరాఠీ, గుజరాతీ భాషా చిత్రాలలో కూడా నటించారు. అనేక చిత్రాలలో ఎన్నో రకాల పాత్రలు ధరించినా ఇతను పోషించిన జాతీయ నాయకుల పాత్రలు దేశానికి గుర్తుండేవి, ప్రేరణ కలిగించేవి. ఒక నటుడిగా ఈ పాత్రలే ఎక్కువ సంతృప్తినిచ్చినట్లు ఆయన చెప్పేవారు. జైరాజ్ పోషించిన టిప్పు సుల్తాన్, పృథ్వీరాజ్ చౌహాన్, రాణా ప్రతాప్ మొదలైన చారిత్రక సంబంధ పాత్రలు విశిష్టమైనవి.
కాగా రీసెంట్ గా ఓటీటీలో రిలీజైన సైకో థ్రిల్లర్ మూవీ కాలా బార్ బేరియన్ చాప్టర్ 1. ఎలాంటి అంచనాలు లేకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాలో నటించిన కరీంనగర్ కుర్రాడు ప్రజ్ఞన్ తెరపైకి వచ్చాడు.
ఈ సినిమాలో ప్రజ్ఞన్ మల్టీ పర్సనాలిటీ సైకో పాత్రలో ఆకట్టుకున్నాడు. ఈ పాత్రలో ప్రజ్ఞన్ అద్భుతమైన నటన చాతుర్యాన్ని ప్రదర్శించాడు.

దీంతో ప్రజ్ఞన్ కు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇలా తాను నటించిన తొలి చిత్రానికే మంచి గుర్తింపు రావడం పట్ల ప్రజ్ఞన్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. కాలా బార్బేరియన్ చాప్టర్ 1లో తన పాత్రకు ప్రశంసలు దక్కాయని పేర్కొన్నాడు. పలువురు ప్రముఖ దర్శకులు ఫోన్ చేసి ప్రశంసిస్తుంటే చాలా ఆనందంగా ఉందని ప్రజ్ఞన్ చెబుతున్నారు.












Click it and Unblock the Notifications