కాచిగూడ నుంచి వెళ్లే ఈ స్పెషల్ ట్రైన్ ఇకపై..: హాల్ట్ స్టేషన్లు
ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గతంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ వస్తోన్నారు. ఏపీ, తెలంగాణల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు ఇవి. నర్సాపూర్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి వంటి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో మెజారిటీ రైలు సర్వీసులను పొడిగించారు. ప్రయాణికుల నుండి అపూర్వ ఆదరణ అందుతున్న నేపథ్యంలో తాజా చర్యలు తీసుకున్నారు.
ఈ క్రమంలో మరో రైలును రెగ్యులర్ గా మార్పు చేశారు. కాచిగూడ నుండి శ్రీ గంగా నగర్ కు రాకపోకలు సాగించే వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఇది. దీన్ని రెగ్యులర్ గా మార్చారు. ఇదివరకు ఉన్న నంబర్ కూడా మారింది. ప్రస్తుతం 07053/07054 నంబర్ తో అందుబాటులో ఉన్న ఈ రైలు ఇకపై 17601/17602 తో రాకపోకలు సాగిస్తుంది. ఈ నిర్ణయంతో, కాచిగూడ- శ్రీ గంగా నగర్ వీక్లీ స్పెషల్ రైలు సర్వీస్ ఇక అధికారికంగా రెగ్యులరైజ్ అయింది.

17601 కాచిగూడ నుండి శ్రీ గంగా నగర్‌కు వెళ్ళే వీక్లీ ఎక్స్‌ప్రెస్ జూలై 25 నుండి ప్రతి శనివారం నాడు అందుబాటులో ఉంటుంది. అలాగే, నంబర్ 17602 శ్రీ గంగా నగర్ నుండి కాచిగూడకు వచ్చే వీక్లీ ఎక్స్‌ప్రెస్ జూలై 28 నుండి ప్రతి మంగళవారం రాకపోకలు సాగిస్తుంది. ఈ కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్ల పూర్తి టైమ్ టేబుల్, హాల్ట్ స్టేషన్ల వివరాలను రైల్వే బోర్డు నోటిఫై చేసింది.
జులై 25 నుంచి ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరే నంబర్ 17601 వీక్లీ ఎక్స్ ప్రెస్ రెండో రోజు.. అంటే సోమవారం రాత్రి 9:30 గంటలకు శ్రీగంగానగర్ కు చేరుకుంటుంది.
జులై 28 నుంచి ప్రతి మంగళవారం తెల్లవారు జామున 6:55 నిమిషాలకు శ్రీగంగానగర్ నుంచి బయలుదేరే నంబర్ నంబర్ 17602 ఎక్స్ ప్రెస్ రెండో రోజు అంటే గురువారం ఉదయం 7:15 నిమిషాలకు కాచిగూడకు చేరుకుంటుంది.
కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణా, బాస్మత్, హింగోలి, వాషిం, అకోలా, మల్కాపూర్, హర్దా, ఇటార్సి, భోపాల్, ఉజ్జయిని, నాగ్డా, కోటా , సవాయి మాధోపూర్, దుర్గాపూర్, జైపూర్, దహర్ కా బాలాజీ, రింగాస్, సికార్, చురు, రతన్‌గఢ్, శ్రీ దుంగర్‌ఘర్, బికానీర్, లాల్‌ఘర్, లుంకరన్సర్, సూరత్‌ఘర్, రాయ్ సింగ్ నగర్, శ్రీ కరణ్‌పూర్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
ఈ రైలులో ఏసీ 2టయర్- 2, ఏసీ 3టయర్- 8, స్లీపర్- 6, జనరల్ సెకండ్ క్లాస్- 4 బోగీలు ఉంటాయి. మొత్తం 20 బోగీలతో ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.












Click it and Unblock the Notifications