కాచిగూడ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్
Kachiguda Nagarcoil Express: కాచిగూడ- నాగర్ కోయిల్ ఎక్స్‌ప్రెస్ పై దక్షిణ మధ్య రైల్వే అధికారులు తాజా సమాచారాన్ని ఇచ్చారు. ఈ ఎక్స్‌ప్రెస్‌కు కొత్తగా ఎల్‌హెచ్‌బీ బోగీలను అమర్చనున్నారు. ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఈ ఎక్స్‌ప్రెస్‌కు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ అత్యాధునిక ఎల్ హెచ్ బీ కోచ్ లు అమర్చిన తొలి ఎక్స్ ప్రెస్ డిసెంబర్ 13వ తేదీన అందుబాటులోకి వస్తుంది.
జర్మనీకి చెందిన లింకె-హాఫ్మన్- బుష్క్ సంస్థ డిజైన్ చేసిన బోగీలు ఇవి. చెన్నై, పంజాబ్‌లోని కపుర్తలా, రాయ్‌బరేలీల్లో గల రైల్వే కోచ్ ఫ్యాక్టరీల్లో ఇవి తయారవుతాయి. ఐసీఎఫ్ రూపొందించిన బోగీలతో పోల్చుకుంటే ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు మరింత సౌకర్యంగా, విలాసవంతంగా ఉంటాయి. గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగానికి అనుగుణంగా ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు రూపొందాయి. యాంటీ టెలిస్కోపిక్, అడ్వాన్స్‌డ్ న్యుమాటిక్ బ్రేక్ సిస్టమ్, యాంటీ కొలిషన్ అవాయిడ్ సిస్టమ్ ఇన్- బిల్ట్‌గా ఉంటాయి ఇందులో.

సాధారణ ఐసీఎఫ్ బోగీలతో పోల్చుకుంటే బరువు తక్కువ. లైట్ వెయిట్ మెటల్‌ను దీని తయారీలో వినియోగిస్తారు. 2022లో రైల్వేల్లో ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల వినియోగం మొదలైంది. మొట్టమొదటిసారిగా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, చెన్నై మెయిల్‌కు ఈ కోచ్‌లను అమర్చారు. క్రమంగా వీటిని విస్తరిస్తోన్నారు. గతంలో సికింద్రాబాద్- తిరువనంతపురం మధ్య రాకపోకలు సాగించే శబరి, విజయవాడ- చెన్నై మధ్య తిరిగే పినాకిని, చెన్నై- తిరుపతి మధ్య నడిచే సప్తగిరి ఎక్స్ ప్రెస్ లకు ఈ బోగీలు అమర్చారు. తాజాగా కాచిగూడ- నాగర్ కోయిల్ ఎక్స్ ప్రెస్ కూడా ఈ జాబితాలో చేరనుంది.
- రైలు నంబర్లు 16354/16353 కాచిగూడ- నాగర్ కోయిల్ ఎక్స్ ప్రెస్ రైలు ఆధునిక ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుస్తుంది.
- ఎల్ హెచ్ బీ కోచ్ లు అమర్చిన తొలి ఎక్స్ ప్రెస్ నాగర్ కోయిల్ నుంచి డిసెంబర్ 13వ తేదీన కాచిగూడకు బయలుదేరుతుంది.
- ఎల్ హెచ్ బీ కోచ్ లు అమర్చిన తొలి ఎక్స్ ప్రెస్ డిసెంబర్ 14వ తేదీన కాచిగూడ నుంచి నాగర్ కోయిల్ కు బయలుదేరుతుంది.
- ఎల్‌హెచ్‌బీ కోచ్‌లకు మారిన తర్వాత, ఈ రైళ్ల కూర్పులో మార్పులుంటాయి. ఇందులో ఒక ఏసీ 2టయర్ కోచ్, ఏసీ 3టయర్ కోచ్ లు- 6, స్లీపర్ క్లాస్ కోచ్ లు- 8, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు- 4 ఉంటాయి. అదనంగా- దివ్యాంగులకు అనుకూలంగా ఒక సెకండ్ క్లాస్ కోచ్, ఒక లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్, ఓ ప్యాంట్రీ కార్ ఈ రైలుకు అమర్చుతారు.












Click it and Unblock the Notifications