కడెం ప్రాజెక్ట్ డేంజర్ బెల్స్: డ్యాం పైనుండి వరదనీరు; వణికిపోతున్న సమీపగ్రామాలు; రెడ్ అలెర్ట్!!
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ మరోసారి వణుకు పుట్టిస్తుంది. కడెం ప్రాజెక్ట్ దిగువన ఉన్న గ్రామాలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది.
డేంజర్ జోన్ లో కడెం ప్రాజెక్ట్#KademProject #TelanganaRains #TelanganaNews #Oneindiatelugu pic.twitter.com/rOSM9wFotg
— oneindiatelugu (@oneindiatelugu) July 27, 2023
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు పూర్తిగా నిండి ప్రాజెక్టు గేట్ల పై నుంచి వరదనీరు ప్రవహిస్తోంది. ఎగువ నుంచి 4 లక్షల క్యూసెక్కుల వస్తుండగా 14 గేట్లు ఎత్తి 2లక్షల 47 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. 14 గేట్లు ఎత్తినప్పటికి ఎగువ నుంచి ఇన్ ఫ్లో అధికంగా ఉండడంతో వరద నీరుపై నుంచి వెళ్తోంది.

ఇలాగే కొనసాగుతే ప్రాజెక్టు తెగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. భారీ వర్షాలకు ఎగువ నుంచి భారీగా వరదనీరు చెరడంతో ప్రాజెక్టుకు మొత్తం 18 గేట్లు ఉండగా 14 గేట్లు తెరుచుకున్నాయి. 4 గేట్లు మొరాయించాయి. ప్రస్తుతం 14 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో ప్రాజెక్టు కట్ట మీదుగ నీళ్ళు ప్రవహిస్తున్నాయి .
ఇక కడెం ప్రాజెక్ట్ వద్ద వరద నీరు ఉదృతంగా ప్రవహించడంతో లోతట్టు గ్రామాల ప్రజలు అక్కడి నుండి వెళ్లిపోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం గేట్ల మీదుగా వరదనీరు ప్రవహించడంతో దిగువనున్న గ్రామాల ప్రజలు, అయకట్టు రైతులు అందోళన చెందుతున్నారు.
ఇదిలా ఉంటే ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండిన దృష్యా గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ తెలిపారు. ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్ట్ ఎగువ పరివాహక ప్రాంతాలైన మహారాష్ట్ర లో మరియు ఉత్తర తెలంగాణాలో అతిభారీ వర్ష కారణంగా ఏక్షణం లోనైనా ప్రాజెక్ట్ లగేట్లు ఎత్తి , గోదావరి నదిలోకి నీళ్లు వదిలే అవకాశం ఉంది.
గోదావరి నది పరివాహక ప్రాంత మండలాలైన ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, రాయికల్ , బీర్పూర్ ధర్మపురి, వెల్గటూర్ నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ భాస్కర్ సూచించారు. నదీ పరివాహక ప్రాంతం లోకి ఎవరూ వెళ్లకుండా అప్రమత్తం గా ఉండాలని కోరారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 నెంబర్ కి కాల్ చేసి సహాయం పొందవలసిందిగ ఎస్పీ సూచించారు.












Click it and Unblock the Notifications