వరదొచ్చే: నీట మునిగిన కాళేశ్వరం పంప్ హౌజ్.. రెగ్యులరే..
వర్షం తగ్గుముఖం పట్టాయి. ఇక వరదలతో ఇబ్బందులు తప్పేలా లేవు. ఇటు భారీ వరదలకు కాళేశ్వరం పంప్ హౌజ్ నీట మునిగాయి. లక్ష్మీ పంప్ హౌజ్‌లో 17, సరస్వతి పంప్ హౌజుల్లో 12 మోటార్లు నీట మునిగాయి. స్కాడా వ్యవస్థ, కంట్రోల్ ప్యానెళ్లు, స్టార్టర్లు, ఎలక్ట్రికల్ పరికరాలు వరద నీటిలో మునిగాయి. నీరు తగ్గితే నష్టాన్ని అంచనా వేయవచ్చని అంటున్నారు. వరదలతో కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌస్‌కు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని చెబుతున్నారు. కాళేశ్వరం వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉందని.. వరదల్లో పంప్‌హౌస్‌లు మునగడం సాధారణమని అంటున్నారు.

గతంలో ఇలా లేవే..?
గతంలో ఇలాంటి వరదలు రాలేదని నీటిపారుదల శాఖ సలహాదారులు పెంటారెడ్డి తెలిపారు. కాళేశ్వరం వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉందన్నారు. వరదల్లో పంప్‌హౌస్‌లు మునగడం సాధారణం అని వివరించారు. పంప్‌హౌస్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండవని స్పష్టం చేశారు. వరద తగ్గగానే పంప్‌హౌస్‌ను పునరుద్ధరిస్తామని తెలిపారు. నీళ్లు తగ్గాక బాగు చేసి యధావిధిగా పంపింగ్ చేస్తామని చెప్పారు.

బాహుబలి పంప్ హౌస్ మునగలే..?
పంప్ హౌస్ నిర్మించే సమయంలో గత 30 ఏళ్ల రికార్డులు పరిశీలిస్తాం.. కానీ అప్పుడు ఇంత పెద్ద వరదలు రాలేదన్నారు. పెద్ద వరద వచ్చినప్పుడు పంప్ హౌస్ మునగడం సాధారణం అని చెప్పారు. పంప్ హౌస్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. వరద తగ్గగానే పంప్ హౌస్‌ను పరిశీలించి పునరుద్ధరణ పనులు ప్రారంభం చేస్తామని చెప్పారు. బాహుబలి పంప్ హౌస్ మునిగింది అని ప్రచారం చేస్తున్నారని.. ఇది అవాస్తవం అన్నారు. గ్రౌండ్ వాటర్ పెరిగితే బావిలో మోటర్లు మునిగిపోయాయి ఇవి కూడా అంతే అని చెప్పారు. నీరు తగ్గాక బాగు చేసి పంపింగ్ చేస్తామని చెప్పారు.

3 నెలల్లో పునరుద్దరణ
రెండు, మూడు నెలలో పంప్ హౌస్ పునరుద్ధరణ చేసి రైతాంగానికి సాగు నీరు అందిస్తామని పేర్కొన్నారు. యాసంగి పంటకు యధావిధిగా సాగునీరు అందుతుందనా చెప్పారు. శ్రీశైలం పంప్ హౌస్, పాలమూరు రంగారెడ్డి పంప్ హౌస్ మునిగాయని.. వాటిని పునరుద్ధరణ చేసి యథాతథ స్థితికి తీసుకొచ్చామని వివరించారు. గతంలో ఇలాంటి వరదలు రాలేదు. దాదాపు 25 ఏళ్ల క్రితం ఇలా ఒకసారి వచ్చిందని.. తిరిగి ఇప్పుడు వరదలు వచ్చాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications