సిద్దిపేటలో పాగా వేస్తాం.. హరీష్‌కు కవిత బహిరంగ సవాల్!

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం సిద్దిపేటలో నూతన పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన అనంతరం కవిత మాట్లాడారు. ప్రజా జీవితం నుంచి హరీష్ రావును తరిమికొట్టే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేసిన కల్వకుంట్ల కవిత.. సిద్దిపేటలో తప్పకుండా తమ పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

వినియోగదారులపై కరెంట్ బిల్లుల పిడుగు: ఇక నెలనెలా అదనపు మోత!
వినియోగదారులపై కరెంట్ బిల్లుల పిడుగు: ఇక నెలనెలా అదనపు మోత!

హరీష్ రావుపై కవిత సంచలన ఆరోపణలు
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిలో తనకు పైసా భాగస్వామ్యం లేదని.. కావాలంటే తన ఆస్తులపై విచారణ చేసుకోవచ్చని కవిత సవాల్ విసిరారు. హరీష్ రావు కేవలం నీళ్లు, నిధుల దొంగ మాత్రమే కాదని, బొగ్గు దొంగ కూడా అని కవిత ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.93 వేల కోట్లు ఖర్చు చేసినా ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు గాను కేవలం లక్ష ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని విమర్శించారు. మల్లన్నసాగర్ అంచనా వ్యయాన్ని రూ.6 వేల కోట్ల నుంచి రూ.9 వేల కోట్లకు పెంచి.. ఎన్డీఆర్ఐ నివేదికలను పక్కనపెట్టి నాసిరకం పనులు చేశారని ఆరోపించారు. బండ్ లీకేజీని కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు బ్లాస్టింగ్ డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. కొండపోచమ్మ సాగర్ నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్ బావిలోకి కెనాల్ ఉందో లేదో బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Kalvakuntla Kavitha Targets Harish Rao and CM Revanth Reddy at Siddipet Office Launch Full Details

2003 నుంచి 2023 వరకు హరీష్ రావు ఎన్నికల అఫిడవిట్లను పరిశీలిస్తే ఆయన ఆస్తులు ఏ స్థాయిలో పెరిగాయో అర్థమవుతుందన్నారు. సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీసును మార్చడం వెనుక, అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయం వల్ల 5 ఎకరాల భూమి వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. రంగనాయక సాగర్ నిర్వాసితులకు సరైన పరిహారం ఇవ్వకుండా హరీష్ రావు మాత్రం తన 14 ఎకరాలకు ఎకరాకు రూ.6 లక్షల చొప్పున పరిహారం తీసుకుని గెస్ట్ హౌస్ కట్టుకున్నారని విమర్శించారు.

వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నిమ్స్ ఉద్యోగుల ఈపీఎఫ్ నిధులు రూ 25 కోట్లు మళ్లించి రూ.100 కోట్ల స్కామ్ చేశారని కవిత ఆరోపించారు. సిద్దిపేటలో సిబ్బంది లేకుండానే వెయ్యి పడకల ఆస్పత్రిని ప్రారంభించారని, ప్రైవేట్ కాలేజీలను బెదిరించి రూ.2 వేల కోట్ల పాల వ్యాపారం చేశారని మండిపడ్డారు. సింగరేణి బొగ్గు తరలింపులోనూ అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. హరీష్ రావు ఎమ్మెల్యే కాకముందే సిద్దిపేటలో ఔటర్ రింగ్ రోడ్డు, సబ్ స్టేషన్లు, ఇంటింటికీ నల్లా ఉండేవని గుర్తు చేశారు. ఆయన వచ్చిన తర్వాతే 120 రైస్ మిల్లులు కాస్తా 20కి పడిపోయాయని, కార్పొరేట్ సంస్థలను తెచ్చి స్థానిక వ్యాపారులు, పద్మశాలీలు, స్వర్ణకారుల ఉపాధిని దెబ్బతీశారని కవిత విమర్శించారు.

ప్రధాని మోదీకి సీఎం రేవంత్ స్పెషల్ రిక్వెస్ట్, అంగీకరించేనా..!?
ప్రధాని మోదీకి సీఎం రేవంత్ స్పెషల్ రిక్వెస్ట్, అంగీకరించేనా..!?

సీఎం రేవంత్‌కు సవాల్
హరీష్ రావు అవినీతిపై తాను అడగే ప్రశ్నలకు మౌనంగా ఉంటే ప్రజలే మౌనంగా బుద్ధి చెబుతారని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. "గుంపు మేస్త్రీతో గుంటనక్క కుమ్మక్కైంది.. అందుకే హరీష్ రావు అవినీతిపై ఎన్ని ఫిర్యాదులు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు" అని కవిత విమర్శించారు. కొండపోచమ్మ సాగర్ అవినీతిపై ఇంజనీర్ల నుంచి రికవరీ చేయాలని నివేదిక వచ్చినా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. హరీష్ రావు అవినీతికి సంబంధించిన ఆధారాలను తాను సీఎంకు అందిస్తానని, ఈ నెల 19న సిద్దిపేటకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి దీనిపై చర్యలు తీసుకుంటారో లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పాలనపై విమర్శలు
కాంగ్రెస్ పార్టీకి ఎద్దు తెలియదు, ఎవుసం తెలియదని కవిత ఎద్దేవా చేశారు. ఏడాది క్రితమే లోయర్ మానేరు డ్యామ్ నుంచి ఎలాంటి ఖర్చు లేకుండా మల్లన్న సాగర్ నింపాలని తాను కోరినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని.. అందుకే నేడు కరువు పరిస్థితులు వచ్చాయని అన్నారు. గౌరవెల్లి నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేదని, ఆర్టీసీ విలీనం కోసం ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ ఆశయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ నెరవేర్చలేదని విమర్శించారు.

కొత్త రాజకీయ ప్రస్థానం
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఏడాది పాటు మేధావులతో చర్చించి 50 కమిటీల ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకున్న తర్వాతే తెలంగాణ రక్షణ సేన పార్టీని స్థాపించానని కవిత వెల్లడించారు. ప్రైవేట్ రంగంలోనూ ఉచిత విద్య, వైద్యం అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఉద్యమ అమరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ.. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులయ్యారని, వారికి అగ్గిపెట్టి దొరికింది కానీ, గ్యాస్ న్యూనె పోసుకున్న హరీష్ రావుకు మాత్రం అగ్గిపెట్టె దొరకలేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సిద్దిపేటకు నిజమైన స్వాతంత్ర్యం తెచ్చేందుకు రాబోయే మున్సిపల్ ఎన్నికల నుంచే పోరాటం ప్రారంభిస్తామని.. ఒకసారి తమకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+