కల్వకుంట్ల కవిత కుమారుల పెద్ద మనసు
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనయులు ఆదిత్య, ఆర్య చిన్నవయస్సులోనే పెద్ద మనసు చాటుకున్నారు. సమాజ సేవ కోసం ఇటీవలే వారిద్దరూ కలిసి మొదలు పెట్టిన సినర్జీ ఆఫ్ మైండ్స్(SOM) ఫౌండేషన్ ద్వారా ఆడపిల్లల చదువుకు చేయూతనిచ్చారు.
హైదరాబాద్, బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో అడ్మిషన్ లభించిన ఆర్థికంగా వెనుకబడిన పది మంది విద్యార్థినులకు ఫౌండేషన్ ద్వారా ఉపకార వేతనాలు అందజేశారు. పది మందిలో ఆరుగురు అండర్ గ్రాడ్యుయేట్, ముగ్గురు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థినులు ఉన్నారు.

కాలేజీలో ఎమ్మెల్సీ కవిత, కాలేజీ ప్రతినిధుల సమక్షంలో ఆదివారం విద్యార్థినులకు స్కాలర్ షిప్పులకు ఆదిత్య, ఆర్య పంపిణీ చేశారు. తన కుమారులు ఇద్దరూ ఫౌండేషన్‌ను స్థాపించి విద్యార్థులకు చేయూత అందించడం సంతోషంగా ఉందన్నారు కవిత. చిన్న వయసులోనే వాళ్లు గొప్పగా ఆలోచించడం తల్లిగా గర్వపడుతున్నానని చెప్పారు.
మహిళా సాధికారతకు తాము ఎప్పుడూ మద్దతు ఇస్తామని చెప్పారు. భవిష్యత్తులోనూ ఫౌండేషన్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపట్టి మంచి పేరు తెచ్చుకోవాలని కవిత ఆకాంక్షించారు. స్కాలర్‌షిప్స్ అందుకున్న విద్యార్థులను ఆమె అభినందించారు.కాలేజీలో పదేళ్లపాటు స్కాలర్ సిప్పులు ఇచ్చేందుకు ఫౌండేషన్ కాలేజీలతో ఒప్పందం చేసుకుంది.
Most cliched line probably from a parent but here we go
— KTR (@KTRBRS) August 19, 2023
Can’t believe this Boy who was a naughty little kid till yesterday is all grown up and now off to College!! As he goes, he’s taking a part of me with him ❤️
Daddy duties; off to the US with family for over a week where I… pic.twitter.com/7k3G9oEi0u
ఇది ఇలావుండగా, తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి పుత్రోత్సాహాన్ని ప్రదర్శించారు. బాల్యం నుంచి ఇప్పటివరకు తనయుడు హిమాన్షు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. బిడ్డ పుట్టినప్పటి నుంచి ఎదిగేవరకు ప్రతి తండ్రి ఇలాగే ఫొటోలు తీస్తుంటాడని వెల్లడించారు.
'నిన్న మొన్నటిదాకా అల్లరి గడుగ్గాయిలా ఉన్న పిల్లవాడు ఇప్పుడు పెద్దవాడై కాలేజీకి వెళుతున్నాడంటే నమ్మలేకపోతున్నాను. హిమాన్షు ఎదిగే కొద్దీ నాలో ఒక భాగంలా మారిపోతున్నాడు' అని వెల్లడించారు. అంతేకాదు, కుటుంబంతో కలిసి అమెరికా టూర్ వెళుతున్నానని, కుటుంబ పెద్దగా నిర్వర్తించాల్సిన విధుల్లో ఇదొకటని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ పర్యటన వారం రోజులు ఉంటుందని, ఈ విహారయాత్రలో భాగంగానే కొన్ని అధికారిక పనులు కూడా నిర్వర్తించాల్సి ఉందని వెల్లడించారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications