Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒకే ఒక్కడు: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సరికొత్త ఆలోచన

కామారెడ్డి: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి సరికొత్త ఆలోచన అమల్లోకి తీసుకొచ్చారు. ఇందుకోసం ఒకే ఒక్కడు సినిమా తరహాలో నియోజకవర్గం మొత్తం ఫిర్యాదు బాక్స్‌లు ఏర్పాటు చేయించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కామాన్ వద్ద ఫిర్యాదు బాక్స్‌ను వెంకట రమణారెడ్డి ఆదివారం ప్రారంభించారు.

కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ ఈ బాక్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కేవీఆర్ తెలిపారు. ఫిర్యాదులను గ్రామానికి వచ్చి నేరుగా తానే పరిష్కరిస్తానని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదు బాక్స్‌ల ద్వారా తనకు తెలియజేయాలని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సూచించారు. . ఇక ఎవరూ వ్యయ ప్రయాసలకు లోనుకాకుండా ఎమ్మెల్యే కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని ప్రజలకు ఎమ్మెల్యే KVR స్పష్టం చేశారు.

kamareddy mla venkata ramana reddys new idea for people issues: set up complaint box.

కాగా, ఇటీవల కామారెడ్డి నియోజకవర్గంలో రహదారి విస్తరణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ విస్తరణ పనుల్లో భాగంగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి తన సొంతింటినే ముందుగా కూల్చేయించారు. బహిరంగ మార్కెట్​లో దీని విలువ సుమారు రూ.6 కోట్లుగా ఉంటుందని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఎందుకంటే కామారెడ్డి పట్టణ పాత మాస్టర్​ ప్లాన్‌​లో జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్​ నుంచి పంచముఖ హనుమాన్​ ఆలయం మీదగా రైల్వేగేట్​ వరకు ఉన్న రోడ్డును 80 అడుగుల రహదారిగా నిర్ణయించారు. అయితే ఈ రహదారి ఆక్రమణలకు గురై దాదాపు 34 అడుగులకు తగ్గిపోయి ట్రాఫిక్​ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.

ఈ విషయాలను గుర్తించిన ఎమ్మెల్యే ఈ రోడ్డు విస్తరణ అత్యంత వేగంగా చేయాలని కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని నిర్ణయించారు. ఈ రోడ్డు విస్తరణ క్రమంలో తన పూర్వీకులు నిర్మించిన సొంత ఇంటిని పడగొట్టాల్సిన అవసరం వచ్చింది. ఇందుకు ఏ మాత్రం చింతించకుండా, ఎమ్మెల్యేననే అహంకారం చూపకుండా స్థానికులు, పురపాలక, రోడ్డు భవనాల శాఖ అధికారుల సమక్షంలో ప్రొక్లెయిన్లలతో కూల్చివేయించి అందరి మనసులు గెలుచుకున్నారు. అలాగే రహదారుల విస్తరణకు ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో అంతా సహకరించారు. అంతేగాక, ఆక్రమణల పేరుతో నిరుపేదల ఇళ్లను తొలగించబోమని స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+