నాకు ప్రాణహాని: డీజీపీని కలిసిన ఐలయ్య, పొలిటికల్ ఎంట్రీపై ఇలా
వివాదాస్పద రచయిత కంచ ఐలయ్య సోమవారం తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మను కలిశారు. కొందరి నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేశారు.దీనిపై స్పందించిన డీజీపీ.. ఎక్కడికైనా వెళ్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇ
హైదరాబాద్: వివాదాస్పద రచయిత కంచ ఐలయ్య సోమవారం తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మను కలిశారు. కొందరి నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డీజీపీ.. ఎక్కడికైనా వెళ్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అనంతరం, కంచ ఐలయ్య మాట్లాడుతూ.. 'ఇప్పటి వరకూ పోలీసులు బాగా సహకరించారు. నాకు నిరంతర రక్షణ కల్పించాలని డీజీపీని కోరాను. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్నవాడిని.. తెలంగాణ రాష్ట్రం వాడిని కనుక, సమస్యను నా ప్రభుత్వం దృష్టికి, పోలీస్ యంత్రాంగం దృష్టికి తీసుకురావడం నా బాధ్యత' అని చెప్పారు.

అంతేగాక, 'సెప్టెంబర్ 5 నుండి నిన్నటి వరకు నాలుగు పెద్ద ఘటనలు జరిగాయి. ఆ పుస్తకం ఏంటో తెలియకుండా రోడ్ల మీద బడి ఒక మేధావి నాలుక కోస్తామని, చంపేస్తామని బెదిరిస్తున్నారు. అధికార పార్టీ ఎంపీ టీజీ వెంకటేష్ కు బీజేపీతో సంబంధాలు ఉన్నాయి.. ఈ విషయం అమిత్ షాకు తెలియకుండా ఉండదు. అసలు, డీమోనిటైజేషనే చాలా పెద్ద సోషల్ స్మగ్లింగ్. దీనిపై చాలాసార్లు నేను వ్యాసాలు రాశాను' అని తెలిపారు.
కాగా, తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఎప్పుడో వచ్చేవాడినని, తెలంగాణ ఉద్యమ సయంలోనే వచ్చేవాడినని ఐలయ్య తెలిపారు. తన గొంతులో ప్రాణముండగా రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. తనది సోషల్ రిఫార్మ్ అజెండా అని ఐలయ్య పేర్కొన్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications