రోహిత్‌కు కార్ల్ సాగన్ సతీమణి లేఖ: రోహిత్ దళితుడు కాడని సుష్మా

హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సియు) విద్యార్థి వేముల రోహిత్‌కు కార్ల్ సాగన్ భార్య లేఖ రాశారు. కార్ల్ సాగన్ మాదిరిగా గొప్ప సైన్స్ రచయితను కావాలని అనుకున్నానని, చివరకు ఆత్మహత్య లేఖ రాయాల్సి వచ్చిందని, ఇలాంటి లేఖ రాయడం తనకు ఇదే మొదటిసారి అని, బహుశా తన చర్య తప్పే కావచ్చునని రోహిత్ తన సూసైడ్ నోట్‌లో రాశాడు.

తన సూసైడ్ నోట్‌లో రోహిత్ తనకు ఇష్టమైన సైన్స్ రచయిత కార్ల్ సాగన్ పేరును ప్రస్తావించాడు. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న కార్ల్ సాగన్ సతీమణి ఆన్ డ్రుయాన్ రోహిత్ లేఖపై స్పందించారు. రాజీవ్ రామచంద్ర అనే సామాజిక కార్యకర్త ద్వారా రోహిత్ మృతి గురించి, తదనంతర పరిణామాల గురించి తెలుసుకుని తాను రోహిత్‌కు లేఖ రాసినట్లు ఆమె తెలిపారు.

రోహిత్ మరణం తననెంతో బాధించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్పష్టంగా చీలిపోయిన మానవ సమాజపు ఆనవాళ్లు రోహిత్ మరణవాంగ్మూలంలో స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. ఎన్ని రకాలుగా ఆలోచించినా వివక్షాపూరిత ధోరణి కొనసాగింపు కారణంగానే రోహిత్ మరణించాడని తనకు అనిపిస్తోందని అన్నారు.

Karl Sagan writes letter to Vemula Rohith

రోహిత్ మరణించిన తర్వాత స్పందించిన సమాజం, భవిష్యత్తులో అలాంటి చావులకు చోటు ఉండబోదనే సందేశాన్ని ప్రకటిస్తుందని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. పాపులర్ సైన్స్‌కు దిశా నిర్దేశం చేసిన కార్ల్ సాగన్ సతీమణిగానే కాకుండా ఆయన రాసిన పుస్తకాలకు సహ రచయితగా కూడా ఆన్ డ్రూయన్ ఖ్యాతి గడించారు.

రోహిత్ దళితుడు కాడు...

హెచ్‌సియూ విద్యార్ధి రోహిత్ దళితుడు కాదని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. రోహిత్‌ను దళితుడని చెప్పడం ద్వారా మొత్తం కేసును కులపరంగా తయారు చేసేందుకు కొందరు యత్నిస్తున్నారని చెప్పారు.

అంతకుముందు రోహిత్‌ను హాస్టల్‌నుంచి బహిష్కరించడం చాలా చిన్న సంఘటన అని, రోహిత్ మృతిపై అనుమానాలున్నాయని బిజెపి నేత కైలాశ్ వర్గీయ అభిప్రాయపడ్డారు. రోహిత్ మరణం దురదృష్టకరమని, ఏటికి ఎదురీదే మనస్తత్వమున్న రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడంటే అనుమానమేనన్నారు. యూనివర్సిటీ నుంచి బహిష్కరించినంతమాత్రాన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+