ఇదీ విషయం: కేసీఆర్-పవన్ భేటీ గుట్టువిప్పిన టీఆర్ఎస్ నేత, జనసేనానికి ఆల్ ది బెస్ట్
Recommended Video

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉన్నారని విపక్షాలు విమర్శలు చేయడంపై టీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ఇలాంటి విమర్శలు అర్థరహితమని చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ పైన కూడా మండిపడ్డారు. అంతేకాదు, ఈ సందర్భంగా ఓ విషయం చెప్పారు. ఇటీవల అజ్ఞాతవాసి సినిమా విడుదలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పవన్ ఎందుకు కలిశారో కూడా తెలిపారు. కర్నె సోమవారం మీడియాతో మాట్లాడారు.

ఏ రహస్య ఒప్పందమూ లేదు
ముఖ్యమంత్రి కేసీఆర్, పవన్ కళ్యాణ్ మధ్య ఎలాంటి రహస్య ఒప్పందం లేదని కర్నె ప్రభాకర్ చెప్పారు. ఒప్పందమని ఆరోపణలు చేసిన పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు, ఆరోపణలు అర్థరహితమని చెప్పారు. తెలంగాణలో తమకు ఎదురులేదని అభిప్రాయపడ్డారు.

పవన్ కళ్యాణ్ అందుకే కలిశారు
పవన్ కళ్యాణ్ తన అజ్ఞాతవాసి సినిమాకు అయిదు షోల అనుమతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారని కర్నె చెప్పారు. కానీ తాము పవన్ కళ్యాణ్‌తో రహస్య ఒప్పందం పెట్టుకునేంత బలహీనంగా లేమని చెప్పారు.

పవన్ పైన కర్నె విమర్శలు
పవన్ కళ్యాణ్ పైనా కర్నె విరుచుకుపడ్డారు. పవన్ సీజనల్ లీడర్ అని ఎద్దేవా చేశారు. ఆయన వల్ల తమకు లాభమూ లేదు, నష్టమూ లేదని అభిప్రాయపడ్డారు. ఆయన పూర్తిస్థాయి నేతగా మారి యాత్ర చేస్తే మాత్రం శుభాకాంక్షలు చెబుతామని, ఆల్ ది బెస్ట్ అన్నారు.

తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన
పవన్ కళ్యాణ్ సోమవారం నుంచి తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన తొలుత కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఆ తర్వాత కరీంనగర్‌లో జనసేన పార్టీ కార్యకర్తలతో భేటీ కానున్నారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
హీరోయిన్ కు పవన్ కల్యాణ్ రాజకీయ ఆఫర్.. ఏం జరిగిందంటే..? -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీమియర్ షో టైమ్ లీక్.. ఇక రచ్చ రచ్చే.. -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
అమరావతిలో తొలి భారీశిల్పం,చారిత్రక స్మారకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు! -
"ఉస్తాద్ భగత్ సింగ్" ప్రీ-రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్‌లో వాహనదారులకు పోలీసుల అలర్ట్ ! -
రాజమండ్రి పరిసరాల్లో "పెద్ద పులి".. హనుమాన్ బృందాలకు పవన్ కీలక ఆదేశాలు !! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !!












Click it and Unblock the Notifications