4న వన్ ఇండియా తెలుగు ఎడిటర్ పుస్తకావిష్కరణ

హైదరాబాద్: ప్రముఖ తెలంగాణ రచయిత, వన్ ఇండియా.కామ్(తెలుగు పోర్టల్) ఎడిటర్ కాసుల ప్రతాపరెడ్డి రచించిన ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు: రాజకీయ సాంస్కృతికోద్యమాలు' పుస్తకావిష్కరణ ఆదివారం(అక్టోబర్ 4న)నాడు జరగనుంది.

హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి కేంద్ర సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ హాజరుకానున్నారు. ఆయన చేతులమీదుగానే ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు: రాజకీయ సాంస్కృతికోద్యమాలు' పుస్తకం ఆవిష్కరణ జరగనుంది.

Kasula Pratap Reddy's book will be released on October 4th

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ తెలుగు సినీా డైరెక్టర్ నరసింగరావు, తెలంగాణ జేఏసి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, ప్రముఖ రచయిత డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి హాజరుకానున్నారు.

ఈ కార్యక్రమంలో సంగిశెట్టి శ్రీనివాస్ ప్రధాన ఉపన్యాయం చేయనున్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అందర్నీ ఆహ్వానిస్తున్నట్లు ప్రతాపరెడ్డి తెలిపారు. కాగా, 'తెలంగాణ సాహిత్యోద్యమాలు' అనే మరో పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు రచయిత ప్రతాపరెడ్డి తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+