కత్తి మహేశ్ అరెస్ట్: శ్రీరాముడిపై వ్యాఖ్యలే కారణం
Recommended Video

పోలీసుల అదుపులో కత్తి మహేశ్
హైదరాబాద్: హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ను సోమవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. మహేశ్ గత రెండురోజుల క్రితం బంజారాహిల్స్‌లోని ఓ టీవీ ఛానెల్ చర్చ వేదికలో సీతారాములను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు.
వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీవీ ఛానెల్ ముందు ఆందోళన విషయం తెలిసిందే. కత్తి మహేశ్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కత్తి మహేశ్ వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు కత్తి మహేశ్‌ను సోమవారం అరెస్ట్ చేసినట్లు బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాస్ తెలిపారు.
మంగళవారం రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. కాగా, కత్తి మహేశ్‌పై పలు పోలీస్ స్టేషన్లలో మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి












Click it and Unblock the Notifications