కవితకు ఈసీ బిగ్ షాక్ - టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందే..!!
కల్వకుంట్ల కవితకు ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) పేరు మార్చుకోవాలని స్పష్టం చేసింది. 'తెలంగాణ రక్షణ సేన' పేరుపై ప్రజల నుంచి అభ్యంత రాలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. 15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ పేర్లు సమర్పించాలని నిర్దేశించింది. ప్రత్యామ్నాయంగా మూడు పేర్లు ఇవ్వకపోతే దరఖాస్తును క్లోజ్ చేస్తామని హెచ్చరించింది. టీఆర్‌ఎస్ పేరును కొనసాగించేందుకు వీల్లేదంటూ ఈసీ లేఖ రాయటంతో ఇప్పుడు కవిత నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.
కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం ఊహించని షాక్ ఇచ్చింది. కొద్ది నెలల క్రితం కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేసారు. తెలంగాణ రక్షణ సేనగా పార్టీ పేరు ప్రకటించారు. అయితే, ఈ పేరు పైన పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఎన్నికల సంఘానికి వచ్చిన ఫిర్యాదుల పైన ఈసీ పరిశీలన చేసింది. తమ పార్టీ మూలాలతో ముడిపడి ఉన్న టీఆర్ఎస్ పేరును ఎట్టి పరిస్థితుల్లో కవిత పార్టీకి రిజిస్ట్రేషన్ చేయవద్దంటూ పెద్ద ఎత్తున ఈసీకి ఫిర్యాదులు చేశారు. ఇందుకు అనుమతి ఇస్తే.. ఓటర్లలో తీవ్ర గందరగోళానికి దారితీస్తుందని ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో తాజాగా ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ పేరును మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ అధికారికంగా కవితకు లేఖ రాశారు. ఇప్పుడు ఈసీ లేఖతో కవిత న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

కవిత నిర్ణయం పై ఉత్కంఠ
కాగా, పార్టీ పేరు మార్పు పైన 15 రోజుల్లోగా నిర్ణయం వెల్లడించాలని ఈసీ సూచించింది. ఆ లోగా మూడు ప్రత్నామ్నాయ పేర్లను తమకు సమర్పించాలని కవిత పంపిన లేఖలో ఈసీ పేర్కొంది. ఒకవేళ నిర్ణీత గడువులోగా కొత్త పేర్లను ప్రతిపాదించకపోతే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును పూర్తి క్లోజ్ చేస్తామని ఈసీ హెచ్చరించినట్లు సమాచారం.కవితకు కేంద్ర ఎన్నికల కమిషన్ రాసిన లేఖలో కీలక విషయాలను ప్రస్తావించింది. రెండు పార్టీల అభ్యంతరాలను ఈసీ జత చేసింది.
తెలంగాణ రాజ్య సమితిపై షోలాపూర్ కు చెందిన తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అభ్యంతరం వ్యక్తం చేసింది. టీఆర్ఎస్ పేరుపై చాలా అభ్యంతరాలు వచ్చాయని ఈసీ తెలిపింది. అయితే, వ్యక్తిగత అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవద్దని కవిత కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పేరును వదిలే ప్రసక్తే లేదని కవిత చెబుతున్నారు. దీంతో... ఈ పేరు విషయంలో తదుపరి పరిణామాల పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications