సోనియాజీ సోనాదో.. ప్రియాంకాజీ స్కూటీదో.. మహిళలకు రూ.2500 ఇవ్వండి: కవిత మెరుపు ధర్నా!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బేగంపేటలోని ప్రజా భవన్ వద్ద నేడు మెరుపు ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కవిత ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మహిళలు, వృద్ధులు, వికలాంగులతో పాటు పలువురు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
ప్రజా భవన్ ముందు ఆ హామీల కోసం కవిత ధర్నా
సోనియా గాంధీ సోనా దీజియే , ప్రియాంక గాంధీ స్కూటీ దీజియే, మహిళలకు నెలకు రూ. 2,500ఇవ్వండి అంటూ ఆందోళన చేశారు. అలాగే పింఛన్‌లను పెంచాలని నినాదాలు చేశారు. అనంతరం, కవిత తన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యకు సమర్పించారు.ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రజావాణికి వచ్చిన తమ విద్యార్థులు, మహిళలను పోలీసులు తప్పుగా అరెస్ట్ చేసి, దురుసుగా ప్రవర్తించారని కవిత తీవ్రంగా ఖండించారు.

ఇలా చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం: కవిత
రోజూ ప్రజావాణిలో ఉంటానన్న సీఎం మాట నిలబెట్టుకోలేదని, ఒక్కసారి మాత్రమే హాజరయ్యారని విమర్శించారు. తమ వారిని అరెస్టు చేస్తున్నారంటేనే వచ్చానని ఆమె తెలిపారు.
వినతి పత్రాలు ఇచ్చేందుకు ఆధార్ కార్డులు, దరఖాస్తు ఫామ్‌లతో శాంతియుతంగా వచ్చామని, పోలీసులతో నియంత్రించే చర్యలు చేపడితే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని కవిత హెచ్చరించారు.
పూర్తిస్థాయి బడ్జెట్ లో హామీలు నెరవేర్చవలసిందే
రానున్న ఫిబ్రవరి 26న ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్‌లో మహిళలకు ఇచ్చిన హామీలైన రూ.2,500, స్కూటీలు, తులం బంగారం కోసం నిధులు కేటాయించాలని కవిత డిమాండ్ చేశారు. అలాగే, రూ.2,000 ఉన్న పింఛన్‌ను రూ.4,000లకు పెంచాలని కూడా ఆమె స్పష్టం చేశారు.బడ్జెట్‌లో ఈ హామీలను నెరవేర్చకుంటే సెక్రటేరియేట్, అసెంబ్లీలను ముట్టడిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని కవిత హెచ్చరించారు.
బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుకు మున్సిపల్ ఎన్నికలే సాక్ష్యం
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయన్న ఆమె, బీఆర్ఎస్ దయతోనే బీజేపీకి ఒకటి, రెండు ఛైర్మన్ సీట్లు వచ్చాయని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుకు మున్సిపల్ ఎన్నికల్లో లభించిన సహకారమే తొలిమెట్టు అని కవిత వ్యాఖ్యానించారు. రైతులకు బోనస్ ఇవ్వడం గొప్ప ఘనత కాదని, అది ప్రభుత్వం ఇచ్చిన హామీనే తప్ప కొత్తది కాదని ఆమె ఎత్తిచూపారు.
మహిళల తరపున మాట్లాడేందుకు నేనున్నా: కవిత
మహిళల హామీలను విస్మరించవద్దని, వారి తరఫున మాట్లాడే వారెవరూ లేరనుకోవద్దని కవిత హెచ్చరించారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న ప్రభుత్వం కనీసం వారికిస్తామన్న రూ.2.500 అయినా వెంటనే అందజేయాలని కవిత డిమాండ్ చేశారు. లేకుంటే తెలంగాణ జాగృతి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తుందని ఆమె స్పష్టం చేశారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications