హరీష్ పై కవిత సంచలన కామెంట్స్, బీఆర్ఎస్ ను నడిపిస్తోంది ఎవరు..!!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ జరిగిన తీరుపైనా.. హరీష్ రావుపైనా కీలక ప్రశ్నలు సంధించారు. బీఆర్ఎస్ ను ఎవరు నడిపిస్తున్నారని నిలదీసారు. బీఆర్ఎస్ సభను బహిష్కరించటం వెనుక కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేసారు. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఒక గుంపును తయారు చేస్తున్నారని కవిత వ్యాఖ్యానించారు. కీలక అంశం పైన చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం సభలో ఉండాల్సిన అవసరం లేదా అంటూ ప్రశ్నించారు.

మరోసారి హరీష్ లక్ష్యంగా కవిత సంచలన ఆరోపణలు చేసారు. ప్రతిపక్షం లేకుండా కృష్ణా నీటి పై అడ్డగోలు అబద్ధాలు చెప్పిందని మండిపడ్డారు. అసెంబ్లీలో కేసీఆర్ తప్పులు చేశాడనే తప్ప కృష్ణా నది నీటి వాటా పై చర్చ లేదన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచుకుంటే ఉత్తరం రాసి వదిలేశారని కవిత పేర్కొన్నారు. కృష్ణా పై చిత్తశుద్ధి ఉంటే ఎందుకు సమగ్ర చర్చ జరపడంలేదని ప్రశ్నించారు. అదే విధంగా.. తుంగభద్ర , కృష్ణ నీటి పై కర్నాటకతో పేచీ ఉంటే రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా ఎందుకు పరిష్కరించడంలేదని నిలదీసారు. కురచ స్వభావంతో గత ప్రభుత్వం పై ని నిందలు వేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ తప్పులు కప్పిపుచ్చు కుంటున్నారని వ్యాఖ్యానించారు. చిత్తశుద్ధి ఉంటే కర్ణాటక అప్పర్ భద్ర జాతీయ హోదా తొలగించాలని , ఆల్మట్టి ఎత్తు తగ్గించాలని తీర్మానం చేయాలని డిమాండ్ చేసారు.

kavitha-directly-targets-hairsh-rao-over-assembly-boycott-decision-question-for-brs

వ్యక్తిగతంగా హరీష్ ని ఒక్క మాట అన్నందుకు సభ ని బాయ్కాట్ చేస్తారా అంటూ కవిత ప్రశ్నించారు. ఆ అంశం పై వాకౌట్ చేస్తే తరవాత సభకు రావొచ్చు కదా.. మిగతా బిల్లుల పై చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం ఉండొద్దా అని కవిత నిలదీసారు. సభ నుండి వాకౌట్ చేయాలనే నిర్ణయం హరీష్ రావు దేనా అంటూ కవిత బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ ఒక గుంపు తయారు చేస్తున్నారని ఆరోపించారు. బాయ్ కాట్ నిర్ణయం అధిష్టానందే అయితే అది శ్రేయస్కరం కాదని చెప్పారు. బయట సభలు పెట్టేకంటే చట్ట సభల్లో మాట్లాడే అవకాశం వదులుకోవడం కరెక్ట్ కాదని సూచించారు. ఒక్క మాట అన్నందుకు సభ బాయ్ కాట్ చేస్తారా అని వ్యాఖ్యానించారు. కృష్ణా పంపకాలల్లో హక్కులు తగ్గించి హరీష్ సంతకం ఎందుకు పెట్టాడో చెప్పి పీపీటీ చేయాలని డిమాండ్ చేసారు. హరీష్ ధన దాహం కోసమే జూరాల నుండి శ్రీశైలానికి మార్పు చేశారని ఆరోపించారు. హరీష్ నిర్ణయాలతో సాగి నీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగిందిని కవిత వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+