తెలంగాణ అభివృద్ధి విఘాతకుడు: రేవంత్‌పై కవిత

మహబూబ్‌నగర్: తెలుగుదేశం నేత, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తెలంగాణ పాలిట అభివృద్ధి విఘాతకుడిగా మారారని ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్‌లో ఇటీవల మృతిచెందిన పార్టీ కార్యకర్త వెంకట్రామ్‌గౌడ్ కుటుంబానికి ఎంపి కవిత రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో జిల్లాకు నిధులు రాకున్నా రేవంత్‌రెడ్డి స్పందించలేదు కానీ, ఇప్పుడు అభివృద్ధి పనులు చేస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు.

Kavitha

ఇటీవల మృతిచెందిన మాజీ మంత్రి ఎల్లారెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలా టిఆర్‌ఎస్ పార్టీ, ప్రభుత్వం ఆదుకుంటుందని ఆమె తెలిపారు. పార్టీ కార్యకర్తలకు టిఆర్‌ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని కవిత చెప్పారు.

అబద్ధాల సామ్రాట్: బాబుపై కర్రె

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపి సిఎం చంద్రబాబునాయుడు అబద్దాల సామ్రాట్ అని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ దుయ్యబట్టారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలేనని.. ఆయన చేసిన అన్యాయం తెలంగాణ ప్రజలకు తెలుసని అన్నారు. అందుకే 2014 ఎన్నికల్లో టీడీపీని ప్రజలు బొందపెట్టారని అన్నారు.

తెలంగాణకు కరెంటు రాకుండా అడ్డుకుంటున్నది చంద్రబాబు కాదా? అని కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు. ఎంసెట్ నిర్వహణకు ఏకపక్షంగా నోటిఫికేషన్ ఇచ్చి విద్యార్థులను అయోమయంలో పడేశారని అన్నారు. టిడిపి నేతలు, శాసనసభ్యులు సాగర్ డ్యాంను డ్యాంను పగులగొడతామంటున్నారని చెప్పారు. బాబు ఎమ్మెల్యేల తీరు అన్నం పెట్టే తల్లినే చంపినట్లుగా ఉందని ధ్వజమెత్తారు. విభజన చట్టం ప్రకారం చంద్రబాబు ఏనాడైనా వ్యవహరించాడా? కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+