చిన్న సంఘటనలతో హైదరాబాద్ ఇమేజ్ డామేజ్ కాదు: కవిత
హైదరాబాద్: చిన్న చిన్నసంఘటనలతో హైదరాబాద్ ఇమేజ్ డామేజ్ కాదని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ రాష్ట్ర సమితి నేత కల్వకుంట్ల కవిత సోమవారం నాడు అన్నారు. హెచ్‌సియులో రోహిత్ వేముల ఆత్మహత్య బాధాకరమన్నారు.
ఏదైనా అంశంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి విద్యార్థుల పైన దాడి చేసినట్లు తేలితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సామాజిక పరమైన అంశాలలో కెసిఆర్ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుందని చెప్పారు.

30న విద్యా వ్యవస్థపై సమగ్ర చర్చ : కడియం
విద్యా వ్యవస్థపై శాసనసభలో ఈ నెల 30న సమగ్ర చర్చ నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. విద్యా శాఖ పద్దులపై కడియం శాసనసభలో మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో 46 శాతం, ప్రయివేటు పాఠశాలల్లో 54 శాతం మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు.
గత పాలనలో విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయాయన్నారు. విద్యా వ్యవస్థ పటిష్టతకు సభ్యులు విలువైన సూచనలివ్వాలని ప్రతిపక్షాలను కోరారు. ఒక్కొక్క గ్రామ పంచాయతీ పరిధిలో అనేక ప్రాథమిక పాఠశాలలు ఉండటం వల్ల ఏ పాఠశాల కూడా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతున్నదన్నారు.
ఇష్టారాజ్యంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం వల్ల పుట్టగొడుగుల్లా కళాశాలలు పుట్టుకొచ్చాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు పెట్టి టీచింగ్ స్టాఫ్‌ను పట్టించుకోలేదని, తగిన సిబ్బందిని కేటాయించలేదన్నారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications