కవిత ఆశల పై కేటీఆర్ నీళ్లు, సెంటిమెంట్ అస్త్రం..!!

కవిత కొత్త పార్టీ ప్రకటన వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ పేరు ఖాళీ గా ఉందంటూ కవిత చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. కీలక మంత్రాంగం మొదలు పెట్టింది. అదే సమయంలో తండ్రిని ఏడిపించవద్దంటూ కవిత రాజకీయం పైన కేటీఆర్ రివర్స్ సెంటిమెంట్ తెర మీదకు తెచ్చారు. కవిత ను రాజకీయంగా దెబ్బ తీసేందుకు బీఆర్ఎస్ సిద్దమైనట్లు తేలిపోయింది. దీంతో.. ఇప్పుడు రాజకీయంగా ఏం చేయబోతున్నారు.

కవిత ఈ నెల 25న కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. కేంద్రం అటు మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం వేళ.. తెలంగాణలో కవిత కొత్త పార్టీ ప్రకటిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో అనేక కొత్త పార్టీలు రావటం.. తరువాత పరిణామాలతో ఇప్పుడు కవిత పార్టీ పైనా చర్చ సాగుతోంది. తాజాగా కొత్త పార్టీకి సంబంధించి కవిత చేసిన వ్యాఖ్యలు ఆసక్తి క‌లిగిస్తున్నాయి. తండ్రి కేసీఆర్ మొద‌ట స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరును క‌విత వాడుకోవాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ సెంటిమెంట్ కూడా తనకు వర్కౌట్ అవుతుందని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కేటీఆర్ కొత్త సెంటిమెంట్ తెర మీదకు తీసుకొచ్చారు. తండ్రిని ఏడిపంచవద్దంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వ్యక్తి గత సమస్యలతో పార్టీలు స్థాపిస్తే మనుగడ ఉండదని వ్యాఖ్యానించారు.

kavitha-s-political-targets-trigger-doubts-is-telangana-heading-for-a-four-cornered-contest

కొత్త పార్టీ వేళ తెర మీదకు కొత్త లెక్కలు

కాగా, కవిత రాజకీయం అంత సులువుగా చేసే అవకాశాలు కనిపించటం లేదు. అటు రేవంత్.. అటు కేసీఆర్.. కేంద్రంలో ఉన్న బీజేపీ వచ్చే తెలంగాణ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటు న్నాయి. తన తండ్రి వ్యూహాలు.. రాజకీయ సామర్ధ్యం గురించి అందరికంటే కవితకే ఎక్కువగా తెలుసు. ఇటు రేవంత్ సైతం అధికారం నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఇక.. బీజేపీ రాజకీయ లెక్కలే వేరు. ఈ పార్టీల నడుమ కవిత తన పార్టీని భిన్నమైన.. ప్రజా వేదికగా.. సామాజిక - ఆర్దిక ప్రత్యామ్నాయంగా ప్రజల్లో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇక, బీఆర్ఎస్ నేతల పైన విమర్శలు చేస్తేనే కేసీఆర్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసారు. పార్టీకి నష్టం చేసే విధంగా కవిత రాజకీయ అడుగులు వేస్తుంటే కేసీఆర్ మౌనంగా ఉండే పరిస్థితి ఉండదనేది సుస్పష్టం. ఇక.. కవిత వెనుక రేవంత్ మద్దతు ఇస్తున్నారనే వాదన బీజేపీ నేతలు వ్యూహాత్మకంగా తెర పైకి తీసుకొస్తున్నారు. కవిత పార్టీ పోటీలో ఉంటే బీఆర్ఎస్ ఓటింగ్ చీల్చే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.

అయితే.. వచ్చే ఎన్నికలు కేసీఆర్ నాయకత్వానికి ఒక విధంగా ప్రతిష్ఠాత్మకం. అదే విధంగా రేవంత్, బీజేపీ భవిష్యత్ తెలంగాణలో డిసైడ్ చేసేవి. ఇక.. కవిత బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మౌనంగా ఉండి.. ఇప్పుడు అదే పార్టీ నేతల పైన విమర్శలు చేస్తే.. ఎంత వరకు ప్రజామోదం లభిస్తుందనేది కీలకంగా మారుతుంది. సామాజిక తెలంగాణ అజెండాగా చెబుతున్న కవిత.. ఆచరణలో ఎంత వరకు చేసి చూపిస్తారనేది మరో ప్రధాన ప్రశ్న. ఇక.. షర్మిల ఎపిసోడ్ సైతం పలువురు గుర్తు చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల్లో టీడీపీ, బీఆర్ఎస్ మినహా తెలంగాణలో నిలిచినవి .. ప్రభావం చూపించినవి చాలా తక్కువ. దీంతో.. కవిత తన అజెండాతో జనం ను ఎంత వరకు నమ్మించగలుగుతారు.. ఎలా నిలుస్తారనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+