కేటీఆర్, హరీష్ పై కవిత సంచలన వ్యాఖ్యలు..!!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేసారు. మాజీ మంత్రి హరీష్ రావు లక్ష్యంగా వరుసగా విమర్శలు చేస్తున్న కవిత.. ఇప్పుడు మరోసారి హరీష్ తో పాటుగా కేటీఆర్ ను టార్గెట్ చేసారు. మున్సిపల్ ఎన్నికల్లో తన పార్టీ నుంచి అభ్యర్ధులను బరి లోకి దింపు తున్న కవిత.. రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పైనా స్పందించారు. కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారుతున్నాయి.

తన అన్న .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేసారు. మునిసిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎవరు నిలబడ్డ కారు గుర్తుపై ఓటు వేయాలని కేటీఆర్ చెబుతున్నారని ప్రస్తావించారు. చెడ్డ వాళ్లకి ఓటు వేయాలని కేటీఆర్ చెబుతున్నారా అని ప్రశ్నించారు. కేటీఆర్ మాటలు నియంతృత్వం, రాచరికపు పోకడలకు నిదర్శనమని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కులం కాదని.. గుణం చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు. పైసలు కాదని.. పని చేసేవారికి ఓటు వేయాలని సూచించారు. మంచి అభ్యర్థులు ఏ పార్టీ నుంచి పోటీ చేసిన ఓటు వేయాలని కోరారు. తెలంగాణ జాగృతి తరఫున మంచి అభ్యర్థులు ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేస్తున్నారని కవిత పేర్కొన్నారు. మరోసారి హరీష్ ను టార్గెట్ చేసారు. రేవంత్‌రెడ్డితో హరీశ్‌రావు కుమ్మక్కు అయి.. నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.

kavitha-targets-ktr-amid-municipal-elections-and-serious-allegations-against-harish-rao

మున్సిపల్ ఎన్నికల ప్రచారం

అదే విధంగ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఫెయిర్‌గా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌పై కేసీఆర్‌ని సిట్ విచారణకు పిలిచిందని ప్రస్తావించారు. ఈ కేసులో సిట్ విచారణకు పిలిస్తే ఎవరైనా పోక తప్పదని కవిత స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు మోదీ సర్కార్ అన్యాయం చేసిందని కవిత విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్న ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. గంజాయి ముఠా దాడులకు పాల్పడుతున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీ ఫీజు సొంతంగా కట్టుకున్నారా..? ప్రభుత్వ సొమ్ముతో కట్టారా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఈ విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ వెళ్లి ఎన్ని ఏంఓయూలు చేసుకున్నారని నిలదీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+