Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్ కు కవిత రివర్స్ జలక్ - సంచలన నిర్ణయం..!?

ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తన తండ్రి కేసీఆర్ కు రివర్స్ షాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా కీలక నిర్ణయం పైన తన మద్దతు దారులతో సమావేశమయ్యారు. కొంత కాలంగా బీఆర్ఎస్ పైన కవిత చేస్తున్న వ్యాఖ్యలు.. ఇప్పుడు తారా స్థాయికి చేరాయి. తాజాగా కాళేశ్వరం వ్యవహారం లో కవిత చేసిన వ్యాఖ్యల పై కేసీఆర్ సీరియస్ అయ్యారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. దీనికి కౌంటర్ గా కవిత మరో కీలక నిర్ణయం ప్రకటించేందుకు సిద్దమయ్యారు.

బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేయటంతో కవిత మరో సంచలన నిర్ణయం ప్రకటించేందుకు సిద్దమయ్యారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రకటన చేసిన వెంటనే తన మద్దతు దారులతో కవిత సమావేశం నిర్వహించారు. తనను వద్దనుకున్న పార్టీ తనకు వద్దని కవిత వ్యాఖ్యానించినట్లు సమాచారం. అందులో భాగంగా పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవితో పాటుగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారు.

Kavitha to resign from MLC post and BRS party following KCR s suspension decision

తన తండ్రికి రాసిన లేఖ లీక్ కావటం పైన తాను ప్రశ్నించానని.. పార్టీలో పరిణామాల పైనే తాను రియాక్ట్ అయ్యానని కవిత మద్దతు దారులతో చెబుతున్నారు. తన తండ్రిని తప్పు దోవ పట్టిస్తున్నారని కవిత ఆరోపిస్తున్నారు. కవిత ను సస్పెండ్ చేయటంతో ఇక.. ఎమ్మెల్సీ పదవి పైనా ఫిర్యాదు చేసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఇక, బీఆర్ఎస్ తో పూర్తిగా సంబంధాలు కట్ చేసుకోవాలని కవిత డిసైడ్ అయ్యారు. కేసీఆర్ దేవుడని.. ఆయన వద్ద దయ్యాలు ఉన్నాయని కవిత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అదే విధంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ప్రయత్నాలు జరిగాయనేది పార్టీకి మచ్చగా మారుతాయని గులాబీ నేతలు వ్యాఖ్యానించారు. ఇక.. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి లేదని కేసీఆర్ టీం వాదిస్తున్న క్రమంలో... కవిత నేరుగా హరీష్, సంతోష్ లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు పార్టీని ఆత్మ రక్షణలోకి నెట్టాయి.

దీంతో, కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో కవిత వివాదం పైన చర్చించారు. కవిత వ్యాఖ్యలు పూర్తిగా పార్టీకి నష్టంగా మారాయని... చర్యలు తీసుకోకుంటే కేడర్ కు ప్రతికూల సంకేతాలు వెళ్లే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అయింది. దీంతో, కవిత పైన సస్పెన్షన్ వేటు వేసారు. దీనికి ప్రతిగా కవిత ఎమ్మెల్సీ పదవితో పాటుగా పార్టీతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+