బీఆర్ఎస్ ఓటమిని సెలబ్రేట్ చేసుకున్న కవిత
జాగృతి అధ్యక్షురాలు కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై ఆమె ట్వీట్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంపై ఆమె సెటైరికల్‌గా స్పందించారు. 'ఖర్మ హిట్స్ బ్యాక్' అంటూ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. పరోక్షంగా బీఆర్ఎస్ ఓటమిని ఆమె ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు. లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లొచ్చిన తర్వాత కవిత, బీఆర్ఎస్ అధినాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. దీంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే కవిత రాజీనామాను స్పీకర్ ఇంకా ఆమోదించలేదు. ప్రస్తుతం కవిత జాగృతి పేరిట ప్రజా పోరాటాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఫలితంపై తనదైనశైలిలో రియాక్ట్ అయ్యారు కవిత.
Karma hits back !!! 🙏🙏🙏🙏
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 14, 2025
ఇక జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం కారణంగా అనివార్యమైన ఈ ఉప ఎన్నిక, కాంగ్రెస్ , బీఆర్‌ఎస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీ పోరాటంగా మారింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ, పట్టువదలని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఈసారి విజయాన్ని అందుకున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీగా ఉండటం, ప్రభుత్వ యంత్రాంగం , నాయకుల కృషి ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

ఓట్ల సమీకరణలో కీలకపాత్ర పోషించిన ఎంఐఎం (MIM) పార్టీ బహిరంగ మద్దతు కాంగ్రెస్ గెలుపును సులభతరం చేసింది. ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఈ మద్దతు కాంగ్రెస్ మెజార్టీని పెంచింది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి బీఆర్‌ఎస్ పార్టీ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు టికెట్ ఇచ్చింది. సానుభూతిపై బీఆర్‌ఎస్ ఆశలు పెట్టుకున్నప్పటికీ, కాంగ్రెస్ అనుకూల పవనాల ముందు బీఆర్‌ఎస్ ఓటమిని చవిచూడక తప్పలేదు. జూబ్లీహిల్స్ విజయం అధికార పార్టీకి మరింత బలాన్ని చేకూర్చగా, బీఆర్‌ఎస్‌కు ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు. నవీన్ యాదవ్ సుమారు 24,000 ఓట్లకు పైగా భారీ మెజార్టీతో విజయం సాధించారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications