జూబ్లీహిల్స్ లో ఏం జరుగుతోంది.. ఆ పార్టీ గెలుపు ఖాయమైందా..!?

జూబ్లీహిల్స్ లో గెలుపు ఎవరిది. ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్న ఎన్నిక ఇది. ఈ ఎన్నికలో గెలుపు మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. కాంగ్రెస్ నుంచి నేరుగా మంత్రులు ప్రచారంలోకి దిగారు. సీఎం రేవంత్ కు ఇక్కడ గెలుపు వ్యక్తిగత ప్రతిష్ఠగా మారుతోంది. కేసీఆర్ ఈ ఎన్నికలో గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ సైతం గెలుపు పైన అంచనాల తో ఉంది. అయితే.. అసలు గ్రౌండ్ రిపోర్టు ఏంటి.. ఓటర్లు ఎవరి వైపు ఉన్నారనే అంశం పైన తాజా నివేదికలు ఆసక్తి కరంగా మారాయి.

జూబ్లీహిల్స్ లో గెలుపు ఎవరికి దక్కినా.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారటం ఖాయంగా కనిపిస్తోంది. ఉప ఎన్నికలో గెలుపు ద్వారా తన ప్రభుత్వం పైన ఉన్న సానుకూలతను భవిష్యత్ సమీకరణాలకు పునాదిగా మలచుకోవాలని రేవంత్ భావిస్తున్నారు. ఇందు కోసం ప్రతీ డివిజన్ కు మంత్రులను బాధ్యులను చేసారు. పలువురు నేతలను మొహరించారు. తాను స్వయంగా ప్రచార బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యారు. అటు కేసీఆర్ ఇప్పటికే జూబ్లీహిల్స్ లో సునీత గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మెజార్టీ లెక్కలు చెబుతున్నారు. కేటీఆర్ - హరీష్ కు జూబ్లీహిల్స్ లో ప్రచారం.. ఎన్నికల మేనేజ్ మెంట్ బాధ్యతలు అప్పగించారు. బీజేపీ నుంచి ముఖ్య నేతలు ప్రచారంలోకి దిగారు.

KCR and Revanth confidence on winning jubilee hills election ground report here

కాగా, ఇక్కడ స్థానిక అంశాలు - సామాజిక సమీకరణాలే కేంద్రంగా ఎన్నిక జరుగుతున్నట్లు స్పష్టం గా కనిపిస్తోంది. బీఆర్ఎస్ సెంటిమెంట్.. ప్రభుత్వ వ్యతిరేకత పైనే ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ స్థానికంగా సామాజిక సమీకరణాలు.. ఎంఐఎం పరోక్ష సహకారంతో పెద్ద సంఖ్యలో ఉన్న మైనార్టీ ఓటింగ్ తమకు కలిసి వస్తుందని భావిస్తోంది.

అయితే.. పార్లమెంట్ ఎన్నికల తరహాలోనే ఇక్కడా తమకు అనూహ్య ఫలితం వస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే.. ఇక్కడ తాజాగా వస్తున్న సర్వే నివేదికలు మాత్రం ఫలితం ఏ ఒక్క పార్టీకి పూర్తి స్థాయిలో అనుకూలంగా లేదని తేల్చి చెబుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా కాంగ్రెస్ - బీఆర్ఎస్ మద్య ఉన్నట్లుగా సర్వే లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

KCR and Revanth confidence on winning jubilee hills election ground report here

కాగా, ఈ నివేదికలతో రేవంత్ వ్యూహం మార్చారు. కేసీఆర్ ఓటర్లను ఆకట్టుకోవటానికి ఫార్ములా మార్పు చేస్తున్నారు. చివరి వారంలో చోటు చేసుకునే సమీకరణాలే ఇక్కడ ఏ పార్టీకి అయినా విజయానికి దోహదం చేసే అవకాశం ఉందని సర్వే రిపోర్టులు తేల్చి చెబుతున్నాయి. దీంతో.. జూబ్లీహిల్స్ కేంద్రంగా చోటు చేసుకునే పరిణామాల పై ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+