సింగరేణి కార్మికులకు కెసిఆర్ వరాలు: సంస్థ లాభాల్లో 21శాతం, పన్ను రద్దు
హైదరాబాద్: సింగరేణి కార్మికులపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వరాల జల్లు కురిపించారు. సంస్థ 2014 - 15 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల్లో 21 శాతం వాటా కార్మికులకు చెల్లించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. సంస్థ కార్మికుల నుంచి వృత్తిపన్ను (ప్రొఫెషనల్ టాక్స్) రద్దు చేయాలని నిర్ణయించినట్లు గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో సింగరేణిపై నిర్వహించిన సమీక్షలో చెప్పారు.
గత ఆర్థిక సంవత్సరం(2014-15)లో ఈ సంస్థ రూ.491 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇందులో 21 శాతం అంటే రూ.103.11 కోట్లను కార్మికులకు పంచాలని ఆయన సూచించారు. ఉమ్మడి రాష్ట్రమున్నప్పుడు సింగరేణి లాభాల్లో 18 శాతం సొమ్మును కార్మికులకు పంచేవారని, దానిని గతేడాది 20కి, ఇప్పుడు 21 శాతానికి పెంచినట్లు సీఎం కార్యాలయం తెలిపింది.

మొత్తం 60 వేల మంది కార్మికులు ఉన్నారని, ఒక్కో కార్మికునికి రూ.15 వేల నుంచి రూ.20 వేల దాకా అందే అవకాశాలున్నట్లు పేర్కొంది. తమ వేతనాల నుంచి వృత్తి పన్ను వసూలు చేయవద్దని కార్మికులు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వారి డిమాండ్‌పై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి వసూలును పూర్తిగా నిలిపివేయాలని సంస్థను ఆదేశించారు.
1990 నుంచి కార్మికుల నుంచి వసూలు చేయాల్సిన వృత్తి పన్ను బకాయిలు రూ.175 కోట్లను పూర్తిగా రద్దు చేశారు. ఈ ఏడాది ఈ పన్ను రూపంలో రూ.15 కోట్లను వసూలు చేయాల్సి ఉంది. దీని రద్దుతో కార్మికులకు ప్రయోజనం కలుగనుంది.
సమీక్ష సమావేశంలో సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలు, టిఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత, సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications