నెలలో చెప్పండి: మెట్రో విస్తరణపై ఎల్ & టీకి కేసీఆర్
హైదరాబాద్: మెట్రో రైలు ప్రాజెక్టును హైదరాబాద్‌లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని తెలంగాణ రాష్ట్ర ముక్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధికారులకు సూచించారు. ఇందుకోసం అవసరమైన విధివిధానాల ఖరారు చేసి శాస్ర్తీయంగా అధ్యయనాలను ప్రారంభించాలన్నారు. సోమవారం సచివాలయంలో మెట్రో రైలు ప్రాజెక్టు పనుల పురోగతితో పాటు పలు అంశాలపై తెలంగాణ కేసీఆర్ సమీక్షించారు.
మెట్రో రైలు ఎండి ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాలసుబ్రమణ్యం, ఎండి. వీబీ గాడ్గిల్‌లకు ప్రత్యేక సూచనలు చేశారు. మెట్రో రైలు ప్రాజెక్టు కారిడార్లలో కేసీఆర్ సూచించిన మార్పులపై అధ్యయనం చేసిన హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) అధికారులు సదరు ప్రతిపాదనలను ఎల్ అండ్ టీ మెట్రోకు అందించారు. సూచించిన మార్పులు చేర్పులను పరిశీలించి నెల రోజుల వ్యవధిలో సమాధానం ఇవ్వాలని కోరింది.
మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకూ నిర్మించే మెట్రో కారిడార్‌లో అసెంబ్లీ ముందు సూచించిన మార్పులతో పాటూ జేబీఎస్ - ఫలక్‌నుమా కారిడార్‌లో సూచించిన రెండు మార్పులు అందులో ఉన్నాయి. అసెంబ్లీ వెనుక నుంచి ప్రతిపాదించిన మార్గం, బడీచౌడీ నుంచి నేరుగా ఉస్మానియా మహిళా కళాశాల గుండా రంగమహల్ వైపునకు ఈ ప్రతిపాదనలు ఉన్నాయి.

కేసీఆర్
మజ్లిస్ సూచించినట్టుగా పాతబస్తీలో చేపట్టిన మార్పుల వల్ల మాత్రం సుమారు మూడు కిలోమీటర్ల దూరం పెరిగుతోంది. ఈ మార్పులను ఎల్ అండ్ టీ మెట్రో వర్గాలు అద్యయనం చేసి వారి సూచనలతో నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదించాలి.

కేసీఆర్
కేసీఆర్ సూచనలతో ఈ ప్రాజెక్టు రెండో దశ పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లేనని తెలుస్తోంది. ఘట్‌కేసర్, తిరుమలగిరి, హయత్‌నగర్, పటాన్‌చెరువు ప్రాంతాల వాసులు ఈ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కేసీఆర్
హైదరాబాద్‌కు విశ్వనగర ప్రణాళికలో భాగంగా ప్రజల భద్రతకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

కేసీఆర్
ఇందులో భాగంగానే నగరంలో సీసీ కెమెరాల సంఖ్యను పెంచాలని, నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని సూచించారు. కాగా, ప్రభుత్వ కార్యాలయాలకు జిల్లా కేంద్రాల్లో పది అంతస్తుల భవనాలు నిర్మించ తలపెట్టారు.












Click it and Unblock the Notifications