మాజీ సైనికులతో భేటీ: సిఎం కెసిఆర్ వరాలు(పిక్చర్స్)

హైదరాబాద్: బంగారు తెలంగాణ నిర్మాణంలో మాజీ సైనికులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మాజీ సైనికుల సహకారం కూడా అవసరమని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లా చిన్న ముల్కనూర్ గ్రామజ్యోతి కార్యక్రమంలో మాజీ సైనికులు పాల్గొనడం ప్రజల్లోకి ఒక మంచి సందేశాన్ని తీసుకువెళ్లిందని తెలిపారు.

గురువారం మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో మాజీ సైనికోద్యోగులు, మాజీ పోలీస్ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ముందుగా వారితో కలిసి భోజనం చేసిన సీఎం అనంతరం వారినుద్దేశించి ప్రసంగించారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుల గౌరవ భృతిని రూ. 3వేలనుంచి రూ. 6వేలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు.

ఆర్థికంగా వెనుకబడిన మాజీ సైనికులకు బలహీనవర్గాల గృహనిర్మాణ పథకంలో కొంత శాతం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే తెలంగాణ రాష్ర్టానికి చెంది ప్రతిభ కనబరిచిన సైనికులను వచ్చే రాష్ట్రావతరణ దినోత్సవాల్లో ఘనంగా సన్మానిస్తామని తెలిపారు. వచ్చే బడ్జెట్‌లో మాజీ సైనికుల సంక్షేమానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని ప్రకటించారు.

రాష్ర్టానికి చెందిన వివిధ అంశాలను వారితో పంచుకున్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డీజీపీ అనురాగ్‌శర్మ, సైనిక్ వేల్ఫేర్ ఆఫీసర్ శ్రీనేశ్‌కుమార్, డైరెక్టర్ సైనిక్ వేల్ఫేర్ కల్నల్ రమేష్‌కుమార్, మాజీ సైనిక ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎం సురేశ్‌రెడ్డి, రిటైర్డ్ ఐజీలు వీ భాస్కర్ రెడ్డి, సీ రత్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాజీ సైనికులకు కెసిఆర్ వరాలు

మాజీ సైనికులకు కెసిఆర్ వరాలు

బంగారు తెలంగాణ నిర్మాణంలో మాజీ సైనికులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

మాజీ సైనికులకు కెసిఆర్ వరాలు

మాజీ సైనికులకు కెసిఆర్ వరాలు

రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మాజీ సైనికుల సహకారం కూడా అవసరమని ఆయన అన్నారు.

మాజీ సైనికులకు కెసిఆర్ వరాలు

మాజీ సైనికులకు కెసిఆర్ వరాలు

కరీంనగర్ జిల్లా చిన్న ముల్కనూర్ గ్రామజ్యోతి కార్యక్రమంలో మాజీ సైనికులు పాల్గొనడం ప్రజల్లోకి ఒక మంచి సందేశాన్ని తీసుకువెళ్లిందని తెలిపారు.

మాజీ సైనికులకు కెసిఆర్ వరాలు

మాజీ సైనికులకు కెసిఆర్ వరాలు

గురువారం మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో మాజీ సైనికోద్యోగులు, మాజీ పోలీస్ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ముందుగా వారితో కలిసి భోజనం చేసిన సీఎం అనంతరం వారినుద్దేశించి ప్రసంగించారు.

మాజీ సైనికులకు కెసిఆర్ వరాలు

మాజీ సైనికులకు కెసిఆర్ వరాలు

రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుల గౌరవ భృతిని రూ. 3వేలనుంచి రూ. 6వేలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు.

మాజీ సైనికులు తన దృష్టికి తెచ్చిన సమస్యలు చాలా చిన్నవని, వాటన్నింటినీ ప్రభుత్వం అతి త్వరలో పరిష్కరిస్తుందని సీఎం భరోసా ఇచ్చారు. జిల్లాల వారీగా మాజీ సైనికులు ఇచ్చిన సమస్యలను క్రోడీకరించి తనకు అందజేయాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కారద్యర్శి, రాష్ట్ర డీజీపీ, హోంశాఖ కార్యదర్శి తాను కలిసి మాజీ సైనికోద్యోగుల సంక్షేమం కోసం ఒక వ్యూహాన్ని రూపొందిస్తామని సీఎం తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సందేశాన్ని అసాంతం విన్న మాజీ సైనికోద్యోగులు తాము రాష్ట్ర పునర్నిర్మాణంలో పాల్గొంటామని తెలియజేశారు. అంతకుముందు మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు, జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు సమస్యలపై విజ్ఞాపన పత్రాలు అందజేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాజీ సైనికులతో కలిసి భోజనం చేసి వారిని గౌరవించలేదని కెప్టెన్ లక్ష్మీకాంతారావు ప్రశంసించారు.

ఈ సందర్భంగా గ్రూప్ కెప్టెన్ డీజేరావు రచించిన బంగారు తెలంగాణ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. మాజీ సైనికోద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కెప్టెన్ ఎం సోమేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సైనికులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విషయం గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+