పొత్తూరికి కెసిఆర్ సత్కారం: వంద ఎకరాల్లో జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం(పిక్చర్స్)

హైదరాబాద్: ప్రముఖ పాత్రికేయులు, ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాసాబ్‌ట్యాంక్‌ పీఎస్‌నగర్‌లోని పొత్తూరి ఇంటికి సోమవారం సాయంత్రం హోంమంత్రి నాయిని, ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీలతో కలసి వచ్చిన సీఎం కేసీఆర్‌... వెంకటేశ్వరరావును సత్కరించారు.

జీవితాంతం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. పొత్తూరిని గౌరవించుకోవడం మన బాధ్యత అని సీఎం కెసిఆర్ అన్నారు. పొత్తూరి వెంకటేశ్వరరావు తన 83వ జన్మదినోత్సవాన్ని సోమవారం జరుపుకున్నారు. గంటకుపైగా కేసీఆర్‌.. పొత్తూరి ఇంట్లోనే ఉన్నారు.

పాత్రికేయులకు 100 ఎకరాల్లో ఇళ్లు

రాజధానిలో పనిచేసే పాత్రికేయుల కోసం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం బుద్వేలులో నివాస గృహ సముదాయాలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. వంద ఎకరాల విస్తీర్ణంలో బహుళ అంతస్థుల సౌధాలను నిర్మించి, అందరికీ వసతి కల్పిస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ ఇళ్ల నిర్మాణంపై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రెస్‌అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. బుద్వేలులోని స్థలం ఇళ్ల నిర్మాణానికి, రవాణా సదుపాయాలకు అనుకూలంగా ఉందని పాత్రికేయ ప్రతినిధులు తెలపగా వారి అభీష్టం మేరకే ఇళ్ల నిర్మాణం చేపడతామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

గ్రామీణాభివృద్ధి శాఖ అధీనంలో ఉన్న ఈ స్థలాన్ని ప్రభుత్వానికి బదలాయించాలని పంచాయతీరాజ్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ అనితా రామచంద్రన్‌కు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాన్ని సమన్వయం చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ రఘునందన్‌రావుకు సీఎం సూచించారు.

హైదరాబాద్‌, వరంగల్‌ నగరాల్లో మొదటి విడతలో ఇళ్లను నిర్మిస్తామని, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా పాత్రికేయులందరికీ ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ఆ భవనాల్లో పౌరసదుపాయాలూ కల్పిస్తామన్నారు. ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై వీరశైవుల ఆరాధ్యుడు బసవేశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

పొత్తూరితో కెసిఆర్

పొత్తూరితో కెసిఆర్

ప్రముఖ పాత్రికేయులు, ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పొత్తూరికి కెసిఆర్ సత్కారం

పొత్తూరికి కెసిఆర్ సత్కారం

మాసాబ్‌ట్యాంక్‌ పీఎస్‌నగర్‌లోని పొత్తూరి ఇంటికి సోమవారం సాయంత్రం హోంమంత్రి నాయిని, ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీలతో కలసి వచ్చిన సీఎం కేసీఆర్‌... వెంకటేశ్వరరావును సత్కరించారు.

పొత్తూరికి కెసిఆర్ సత్కారం

పొత్తూరికి కెసిఆర్ సత్కారం

జీవితాంతం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.

పొత్తూరికి కెసిఆర్ సత్కారం

పొత్తూరికి కెసిఆర్ సత్కారం

పొత్తూరిని గౌరవించుకోవడం మన బాధ్యత అని సీఎం కెసిఆర్ అన్నారు.

పొత్తూరికి కెసిఆర్ సత్కారం

పొత్తూరికి కెసిఆర్ సత్కారం

పొత్తూరి వెంకటేశ్వరరావు తన 83వ జన్మదినోత్సవాన్ని సోమవారం జరుపుకున్నారు. గంటకుపైగా కేసీఆర్‌.. పొత్తూరి ఇంట్లోనే ఉన్నారు.

పాత్రికేయులతో కెసిఆర్

పాత్రికేయులతో కెసిఆర్

రాజధానిలో పనిచేసే పాత్రికేయుల కోసం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం బుద్వేలులో నివాస గృహ సముదాయాలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు.

పాత్రికేయులతో కెసిఆర్

పాత్రికేయులతో కెసిఆర్

వంద ఎకరాల విస్తీర్ణంలో బహుళ అంతస్థుల సౌధాలను నిర్మించి, అందరికీ వసతి కల్పిస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ ఇళ్ల నిర్మాణంపై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

పాత్రికేయులతో కెసిఆర్

పాత్రికేయులతో కెసిఆర్

ప్రెస్‌అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. బుద్వేలులోని స్థలం ఇళ్ల నిర్మాణానికి, రవాణా సదుపాయాలకు అనుకూలంగా ఉందని పాత్రికేయ ప్రతినిధులు తెలపగా వారి అభీష్టం మేరకే ఇళ్ల నిర్మాణం చేపడతామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+