దేశంలో కేసీఆర్ సెంటిమెంట్ ఫాలో అయ్యేవారే ఎక్కువట..!
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కేసీఆర్ ను ఫాలో అయ్యేవారి సంఖ్య పెరుగుతోందట. వాస్తు, జ్యోతిష శాస్త్రాలను బలంగా నమ్మే కేసీఆర్ ప్రతి విషయంలోనూ పండితుల సలహాలు, సూచనలు తీసుకుంటారు. ఆరో సంఖ్యను కేసీఆర్ లక్కీ నెంబర్ గా చెబుతుంటారు. అందుకే ఆయన వాహనాలకు 6666 నెంబరే ఉంటుంది. ఇవన్నీ కూడితే 24 వస్తుంది. మళ్లీ ఈ రెండింటినీ కలిపితే కూడా మళ్లీ ఆరు నెంబరే వస్తుంది. అదలావుంటే తొలుత కేసీఆర్ కాన్వాయ్ వాహనాలు బ్లాక్ కలర్ లో ఉండేవి. తర్వాత కొద్దికాలానికే తెల్ల రంగులోకి మార్చారు. ఇదంతా కూడా కేసీఆర్ సెంటిమెంట్.
సాధారణంగా వీవీఐపీ ల వాహన శ్రేణి భద్రతా కారణాల రీత్యా బ్లాక్ కలర్ లో ఉంటుంది. అయితే నలుపు రంగు వాహనాలు తనకు అచ్చిరావడం లేదని కేసీఆర్ భావించడంతో తెలుపు రంగు వాహనాలు సమకూర్చారు. అంతేకాదు రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో పోలీసుల వాహనాలు కూడా తెలుపు రంగులోకి షిఫ్ట్ చేయడం గమనార్హం.

దేశమంతా తెలుపు రంగే..!
కేసీఆర్ తన కాన్వాయ్ తో పాటు తెలంగాణ పోలీసుల వాహనాలు కూడా తెలుపు రంగులోకి మార్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ వైట్ కార్ సెంటిమెంట్ దేశవ్యాప్తంగా ఫాలో అవుతున్నారట. ఎక్కువ శాతం మంది భారతీయులు తెల్ల కారు వైపే మొగ్గుచూపుతున్నారట. ఆ కలర్ ఈ కలరంటూ అన్నీ కలర్స్ చూసి చివరకు వైట్ కలర్ కారంటేనే ఇష్టపడుతున్నారట.

43 శాతం తెల్ల కార్లే..!
ఇండియాలో తెలుపు రంగు కార్లకు మాంఛి డిమాండ్ ఉందట. భారతీయులకు తెలుపు రంగు కార్లంటేనే ఎక్కువగా ఇష్టమంట. జర్మనీకి చెదిన BASF అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. బీఏఎస్‌ఎఫ్ కలర్ రిపోర్ట్ ఫర్ ఆటోమోటివ్ ఓఈఎం కోటింగ్స్ పేరుతో వెలువరించిన నివేదికలో కార్ల రంగులకు సంబంధించిన పలు విషయాలు వెలుగుచూశాయి. 2018లో 43 శాతం మంది భారతీయులు తెలుపు రంగు కార్లను ఎంచుకున్నట్లు ఆ నివేదిక సారాంశం.

స్టైలిష్ అండ్ లగ్జరీ
వైట్ తర్వాత గ్రే కలర్ తో పాటు సిల్వర్ రెండో స్థానం ఆక్రమించాయి. ఈ రెండు కూడా 15 శాతం మేర ఉన్నట్లు పేర్కొంది. 9 శాతం ఎరుపు, 7 శాతం నీలం, 3 శాతం బ్లాక్ రంగు కార్లను ఎంపికచేసుకున్నారట. వాతావరణంలో వేడి కారణంగా భారతీయులు తెలుపు రంగు కార్ల వైపు ఎక్కువగా మొగ్గుచూపుతారనేది ఆ సంస్థ చెబుతున్న మాట. తెలుపు రంగు కారణంగా ఆ కార్లు త్వరగా వేడెక్కవని.. వైట్ కలర్ కారు విలాసవంతమైన లుక్ తో కనిపించడం కూడా మరో కారణమంటోంది. అయితే తెల్లకారుకు మరకలు అంటడం, మాటిమాటికీ కడగటం లాంటి ఎక్స్‌ట్రా పనులతో ఒకప్పుడు బ్లాక్ కలర్ వైపు మొగ్గుచూపేవారు. రానురాను తెల్ల కలర్ కార్లు రాజ్యమేలుతున్నాయి. మెయింటెనెన్స్ గురించి ఆలోచించకుండా ఉద్యోగుల నుంచి లీడర్ల దాకా తెల్ల కలర్ కార్లనే కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications