వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజ్ఞప్తి!: 'చంద్రబాబు-కేసీఆర్‌లు మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా చూడాలి'

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లు 'భరత్ అనే నేను' సినిమా చూడాలని సీపీఐ రామకృష్ణ మంగళవారం సూచించారు. ఆ సినిమా చూస్తే ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించాలో తెలుస్తుందన్నారు.

Recommended Video

భరత్ అనే నేను మూవీ కలెక్షన్స్

ఇతర పార్టీలు అవినీతిపరులకు టిక్కెట్లు ఇస్తూ కమ్యూనిస్టులపై ఆరోపణలు చేయడం విడ్డూరం అన్నారు. గాలి జనార్ధన్ రెడ్డి సోదరుడికి బీజేపీలో పదవులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని విమర్శించారు. స్థానిక సంస్థలను, ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు రాచరిక పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు.

KCR and Chandrababu should see Bharat Ane Nenu film

తెలంగాణ బద్ద శత్రువు సీపీఎం

తెలంగాణ రాష్ట్రానికి సీపీఎం పార్టీ బద్ద శత్రువు అని టీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు ఆ పార్టీ కుట్రలు చేసిందన్నారు. ఇప్పుడు కూడా అదే వైఖరితో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. తెలంగాణ అంటేనే సీపీఎంకు గిట్టదని ధ్వజమెత్తారు.

ఇంత జరుగుతుంటే మౌనమా?: పవన్ కళ్యాణ్, మద్దతుగా అల్లు అర్జున్, '6 నెలలుగా కుట్ర'ఇంత జరుగుతుంటే మౌనమా?: పవన్ కళ్యాణ్, మద్దతుగా అల్లు అర్జున్, '6 నెలలుగా కుట్ర'

ప్రజలు అందరూ తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న సమయంలో, వందలాది మంది బలిదానాలు చేసిన సమయంలో సీపీఎం మాత్రం తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం ఆ పార్టీకి లేదన్నారు. అది ఎప్పటికీ తోక పార్టీయే అన్నారు. సొంతగా ఎదగాలనే ధ్యాస లేదన్నారు. సీపీఎం క్యాపిటలిస్టు పార్టీగానే మిగిలిపోతుందన్నారు.

English summary
CPI Ramakrishna on Tuesday suggested Telangana Chief Minister KCR and AP CM Nara Chandrababu naidu should that they should see Mahesh Babu starrer Bharat Ane Nenu film.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X