2019లో బిజెపియే: మోడీని కాపీ కొడుతున్న కెసిఆర్, ఇదిగో..!
ఇందూరు: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న పథకాలను కాపీ కొడుతున్నారా? అంటే అవుననే చెబుతున్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు. అందుకు ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు.
భారతీయ జనతా పార్టీ శాసన సభాపక్ష ఉపనేత ఎన్వీవీఎస్ ప్రభాకర్ గురువారం నిజామాబాద్ జిల్లాలో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీని కెసిఆర్ కాపీ కొడుతున్నారని చెప్పారు.
మోడీ డిజిటల్ ఇండియాను రూపొందిస్తే, డిజిటల్ తెలంగాణతో కెసిఆర్ ముందుకు వచ్చారని, అలాగే, గ్రీన్ ఇండియా అని కేంద్రం అంటే హరితహారం అని కొత్త పేరు పెట్టి మోడీ మార్కును అనుసరిస్తున్నారని చెప్పారు. మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభిస్తే, కెసిఆర్ స్వచ్ఛ హైదరాబాద్ అన్న విషయం తెలిసిందే.

కెసిఆర్ పైన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రభాకర్ మండిపడ్డారు. అవకాశవాద రాజకీయాలకు తెరతీసిన అధఇకార పార్టీ ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటోందని ధ్వజమెత్తారు. వలసలను టీఆర్ఎస్ ప్రోత్సహిస్తోందన్నారు.
2019 ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్యనే రాష్ట్రంలో ప్రధానంగా పోటీ ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బిజెపి ఎదుగుతోందని చెప్పారు. ఆన్ లైన్ సభ్యత్వం పూర్తయిన తర్వాత గ్రామగ్రామానికి వెళ్లి బిజెపిని బలోపేతం చేస్తామన్నారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications