ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేత: శ్యాం బెనెగల్ సహా పలువురు ఇలా..

హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రి భవనాన్ని కూలుస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన ప్రకటనపై సామాన్యులతో సహా ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఉస్మానియా జనరల్ ఆస్పత్రి కూలిపోయే పరిస్థితిలో ఉందని, వారసత్వ కట్టడం పేరు మీద దాన్ని అలాగే ఉంచాలనడం సరి కాదని కెసిఆర్ ఇటీవల ప్రకటించారు. అయితే, దానిపై ప్రముఖ సినీ దర్శకుడు శ్యాంబెనెగల్ సహా పలువురు ప్రముఖులు స్పందించారు

కెసిఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ట్విట్స్ చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఉస్మానియా ఆస్పత్రిని కూల్చాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై నెటిజన్లు వ్యతిరేకత ప్రదర్సిస్తున్నారు. సోషల్‌ మీడియా సైట్లయిన ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లలో ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని రక్షించాలని గొంతెత్తుతున్నారు. వారి అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి.

హైదరాబాద్‌కి చార్మినార్‌ ల్యాండ్‌మార్క్ అయినట్లుగానే హైకోర్టు, ఓయు ఆర్ట్స్‌కాలేజీ, ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌ లాంటివి కూడా ల్యాండ్‌మార్క్స్‌. హైదరాబాద్‌ సాంస్కృతిక లక్షణాలకి ఇవి ప్రతి రూపాలు. వీటిని కూల్చాలని ఎలా భావిస్తారు? - శ్యాంబెనగల్‌, సినీ దర్శకుడు

KCR decission to dismantle Osmania hospital deplored

మనం ఈ కూల్చివేతను ఆపించాల్సిన అవసరం ఉంది. ఇందుకు సెలబ్రిటీలతో పాటుగా సామాన్యులు కూడా కలిసిరావాలి. సానియా కెన్‌ వి డు సమ్‌థింగ్‌..? - ఆదితి రావు హైడ్రీ, సినీ నటి

ఎందుకు మనం ఎప్పుడూ మన వారస త్వాన్ని నాశనం చేయాలనుకుంటాం? ఐకా నిక్‌ కట్టడాన్ని కచ్చితంగా కాపాడుకోవాలి. - సినీ నటి దియా మీర్జా

ఓజీహెచ్‌ ఓ బిల్డింగ్‌ మాత్రమేకాదు.. ఇది యూరోపియన్‌, భారతీయ ఆర్కిటెక్చర్‌ నైపుణ్యానికి ప్రతీక. దీనిని కూల్చడమంటే నేరం చేస్తున్నట్లే..! ఎవరైతే దీనిని కూల్చాలనుకుంటున్నారో వారు హైదరాబాద్‌ వారసత్వ, చారిత్రక సంపదని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతని గుర్తించాల్సి ఉంది. - ద లాస్ట్‌ నిజామ్‌ రచయిత జాన్‌ జుబ్ర్‌ జైస్కి

ఉస్మానియా భవనం కూల్చడానికి సిద్ధమయ్యారంటే హైదరాబాద్‌ రాజకీయ నాయకులు పిచ్చివాళ్లు అయినా అయి ఉంటారు లేదంటే రియల్‌ ఎస్టేట్‌ లాబీ వల్ల కరప్ట్‌ అయినా అయి ఉంటారు. - విలియం డాల్రింపెల్‌, వైట్‌ మొఘల్స్‌ రచయిత

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+