ఆస‌క్తి రేపుతున్న కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌..! పంటి, కంటి మాటున మ‌త‌ల‌బేంటి..?

Recommended Video

    Telangana Elections 2018 : ఆస‌క్తి రేపుతున్న కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ | Oneindia Telugu

    హైద‌రాబాద్ : తెలంగాణ ఆప‌థ‌ర్మ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ఏం చేసినా రాజ‌కీయంగా సంచ‌నాల‌కు దారి తీస్తుంటుంది. అది ఫార్మ్ హౌస్ లో అల్లం పండించినా, ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో చేరిక‌లైనా, ఢిల్లీలో రాజ‌కీయ మంత‌నాలైనా ఆయ‌న మార్క్ క‌నినిస్తుంటుంది. ఇక దేశ రాజకీయాలు వాడి వేడిగా జ‌రుగుతున్న త‌రుణంలో ఆయ‌న అక‌స్మాత్తుగా ఢిల్లీ బాట ప‌డ‌తారు. చంద్ర‌శేఖ‌ర్ రావు ఢిల్లీ ప‌ర్య‌ట‌న వెన‌క మ‌ర్మం ఏంట‌ని ఎంత వెదికినా ఎవ‌రికి అంతుచిక్క‌కుండా ఉంటుంది. తాజాగా తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు, ఏపిలో ఐటీ దాడులు, మ‌హాకూట‌మి లో చ‌ర్చోప చ‌ర్చ‌లు, గ‌వ‌ర్న‌ర్ మూడు రోజులు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌, జ‌గ‌న్ పై దాడి సంఘ‌ట‌న‌ల‌తో ఉత్కంఠ‌గా మారిన రాజ‌కీయాల‌కు చంద్ర‌శేఖ‌ర్ రావు ఆక‌స్మిక ఢిల్లీ ప్ర‌యాణం మ‌రింత ఉంత్కంఠ‌కు గురిచేస్తుంది. కంటి, పంటి చెక‌ప్ ల మాటున మ‌త‌ల‌బేమైనా ఉందా అనే సందైహం రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌లుగుతోంది.

    కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌..! ఎన్నో అనుమానాలు..!!

    కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌..! ఎన్నో అనుమానాలు..!!

    టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, తెలంగాణ అప‌ద్ధ‌ర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మ‌రోమారు అనూహ్య రీతిలో వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఓవైపు ముంద‌స్తు ఎన్నిక‌ల ఎత్తుగ‌డ‌లో బిజీగా ఉన్న గులాబీ బాస్ ఆకస్మికంగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న పెట్టుకున్నారు. ఎన్నిక‌ల హీట్ తారాస్థాయికి చేర‌డం, ఓవైపు మ‌హాకూట‌మి త‌న అస్త్రాల‌కు ప‌దును పెడుతుండ‌టం మ‌రోవైపు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన ఏపీ సీఎం చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లి వ‌చ్చిన మ‌రునాడే చంద్ర‌శేఖ‌ర్ రావు ఢిల్లీ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అదే స‌మ‌యంలో ఈ టూర్ వెనక మ‌త‌ల‌బు మ‌రోటి ఉంద‌ని ప‌లువురు నేత‌లు చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది.

    కంటి, పంటి ప‌రీక్ష‌ల వెన‌క మ‌త‌ల‌బు ఉందంటున్న కాంగ్రెస్..!

    కంటి, పంటి ప‌రీక్ష‌ల వెన‌క మ‌త‌ల‌బు ఉందంటున్న కాంగ్రెస్..!

    కంటి పరీక్ష కోసమే కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారని టీఆర్ఎస్ పార్టీ అధికారిక ప్రకటన చేసింది. అయితే, ఈ టూరుపై రాజ‌కీయ వ‌ర్గాల్లో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. కేసీఆర్ కూడా రెండు, మూడు రోజులు ఢిల్లీలో ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారు. తన టూర్ లో పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ కలిసి టీఆర్ఎస్ ను టార్గెట్ చేయడంతో పాటు కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ప్రయాణం అనేక రకాల ఆలోచనలకు దారితీస్తోంది.

    బాబు తిరిగు ప్ర‌యాణం వెంట‌నే కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఎందుకు..? ప‌్ర‌శ్నిస్తున్న ప్ర‌తిప‌క్షాలు..!!

    బాబు తిరిగు ప్ర‌యాణం వెంట‌నే కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఎందుకు..? ప‌్ర‌శ్నిస్తున్న ప్ర‌తిప‌క్షాలు..!!

    చంద్రబాబు దాదాపు 3 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి పలువురు కాంగ్రెస్‌ నాయకుల్ని కలిశారు. ఈ క్రమంలో బాబు తిరిగి రాగానే కేసీఆర్ ఆఘ‌మేఘాల మీద వెళ్లడం పలు ఆలోచనలు రేకెత్తిస్తోంది. మ‌రోవైపు కేసీఆర్ ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఊహించని ప‌రిణామం చోటు చేసుకుంది. తెలంగాణా ప్రజలను, డాక్టర్ల‌ను అవమానపరిచిన కేసీఆర్ క్షమాపణ చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణా ప్రజలకు కంటి పరీక్షలు, చికిత్స తెలంగాణా పల్లెల్లో జరిగితే., ముఖ్యమంత్రి కండ్లకు మాత్రము ఢిల్లీ డాక్టర్స్ తో చికిత్స చేయించుకుంటున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఇంతకంటే అవమానం ఏంటని ఆయ‌న నిల‌దీసారు.

    రాజ‌కీయ కోణం ఉంది..! ఇది ముమ్మాటికి ర‌హ‌స్య ప‌ర్య‌ట‌నే అంటున్న కాంగ్రెస్..!

    రాజ‌కీయ కోణం ఉంది..! ఇది ముమ్మాటికి ర‌హ‌స్య ప‌ర్య‌ట‌నే అంటున్న కాంగ్రెస్..!

    కంటి పరీక్షలకు దేశ‌వ్యాప్తంగా ప‌లువురు ప్ర‌ముఖ నేత్ర వైద్యశాల ఎల్వీ ప్రసాద్‌కు వస్తే మన సీఎం ఢిల్లీ కి ఎందుకు పోయాడో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా సీఎం కంటి సమస్యతో ఢిల్లీ వెళ్తున్నారా లేక రహస్య రాజకీయ పర్యటనా అని ఆయ‌న సందేహం వ్య‌క్తం చేశారు. దేశ వ్యాప్తంగా ఉద్రిక్త ప‌రిస్తితులు నెల‌కొన్న త‌రుణంలో కేసీఆర్ ప‌ర్య‌ట‌న ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్ర‌సిడెంట్ రేవంత్ రెడ్డి సెక్యూరిటీ అంశంలో నెల‌కొన్న ప‌రిణామాల‌ను కేంద్ర‌ హోంశాఖ‌తో చ‌ర్చించేందుకే చంద్ర‌శేఖ‌ర్ రావు ఢిల్లీ వెళ్లిన‌ట్టు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+