వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫెడరల్‌ఫ్రంట్: మేలో ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్‌తో కెసిఆర్ చర్చలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా వచ్చే నెలలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ను కలవనున్నారు. ఇప్పటికే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిని కెసిఆర్ కలిశారు. నాలుగు రోజుల క్రితం బెంగుళూరులో మాజీ ప్రధానమంత్రి దేవేగౌడను కలిశారు. వచ్చే నెలలో నవీన్ పట్నాయక్‌ను కలవనున్నట్టు టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

Recommended Video

మాజీ ప్రధాని దేవేగౌడతో కెసిఆర్ భేటీ...!

దేశంలో కాంగ్రెస్, బిజెపి వ్యతిరేక పార్టీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్యాయ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కెసిఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రాంతీయ పార్టీల నేతలతో కెసిఆర్ చర్చలు జరుపుతున్నారు. కర్ణాటకలో నాలుగు రోజుల క్రితం మాజీ ప్రధానమంత్రి దేవేగౌడను కలుసుకొని దేశంలో రాజకీయ పరిస్థితులపై కెసిఆర్ చర్చించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు తన పూర్తి సహయ సహకారాలు అందిస్తానని ఆయన హమీ ఇచ్చారు.

kcr to discuss with Naveen patnaik for Federal front soon

తాజాగా వచ్చే నెలలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా నవీన్ పట్నాయక్‌తో చర్చించనున్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని కెసిఆర్ భావిస్తున్నారు. కాంగ్రెస్, బిజెపిలు దేశంలో ప్రజల సమస్యలను పరిష్కరించలేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నెల 27న టిఆర్ఎస్ ప్లీనరీ ఉంది. ఈ ప్లీనరీ కంటే ఒడిశా వెళ్ళాలని కెసిఆర్ భావించారు. కానీ, ఒడిశాలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున నవీన్ పట్నాయక్ వచ్చే నెలలో రాష్ట్రానికి రావాలని సూచించారు. దీంతో కెసిఆర్ తన పర్యటనను వచ్చే నెలకు వాయిదా వేసుకొన్నారు. మే మొదటి వారంలో కెసిఆర్ ఒడిశా పర్యటనకు వెళ్ళనున్నారు.

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై నవీన్ పట్నాయక్‌తో చర్చించనున్నారు. కాంగ్రెస్,బిజెపిలకు వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు, ఫ్రంట్ లక్ష్యాలను పట్నాయక్‌తో కెసిఆర్ చర్చించే అవకాశం ఉందని టిఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.

English summary
Trs chief KCR will to visit Odisha state for discuss Federal front with Odisha chief minister Naveen Patnaik on May 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X