స్టూడెంట్స్ తో పెట్టుకోకు కెసిఆర్ కు జగ్గారెడ్డి హెచ్చరిక
హైదరాబాద్ : ఫీజు రీ ఎంబర్స్ మెంట్ చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ నవంబర్ 7వ, తేదిన సంగారెడ్డి కలెక్టరేట్ ను ముట్టడిస్తున్నట్టు ప్రకటించారు మాజీ విప్ , కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి.
పీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆయన విమర్శించారు. సోమవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు.ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలను చెల్లించేవరకు తమ ఉద్యమం ఆగదన్నారాయన.

తెలంగాణ ఉద్యమంలో విధ్యార్థుల పాత్ర మరువలేనిదని ఆయన గుర్తు చేశారు. తమ ఫ్రాణాలను, చదువులను ఫణంగా పెట్టి విధ్యార్థులు ఉద్యమం చేశారని ఆయన గుర్తు చేశారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత కెసిఆర్ విధ్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలను చెల్లించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ బకాయిలను వెంటను చెల్లించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 7వ, తేదిన సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్టు చెప్పారు జగ్గారెడ్డి.












Click it and Unblock the Notifications