టిఎస్ పాస్: ఐఎస్‌బి విద్యార్థులతో కెసిఆర్(పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు అత్యంత సులభంగా, ప్రశాంతంగా వ్యాపారం చేసుకునేలా ప్రభుత్వం జూన్ 12న ఇండస్ట్రియల్ పాలసీ(టీఎస్ ఐపాస్)ని ప్రకటించనుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు చెందిన 56 మంది ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రతినిధులతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శుక్రవారం జరిగిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు.

ప్రభుత్వం తెచ్చే పాలసీతో తెలంగాణ రాష్ర్టానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా సింగిల్ విండో విధానంలో అనుమతుల జారీ, ఆన్‌లైన్ దరఖాస్తు విధానం, దరఖాస్తుల పరిశీలనకు సీఎంవోలో చేజింగ్ సెల్, 10-12 రోజుల్లోనే దరఖాస్తుల ప్రాసెస్ పూర్తి చేసి, తన చేతుల మీదుగానే ప్యాకెట్ రూపంలో అన్ని అనుమతుల పత్రాలను అందించడం జరుగుతుందని కేసీఆర్ తెలిపారు.

పరిశ్రమల ఏర్పాటుకు 1.70లక్షల ఎకరాల భూమి ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు, అధికారులు చాలావేగంగా పనిచేస్తున్నారని, అందరికృషి తెలంగాణ అభివృద్ధి పర్చడంవైపే సాగుతోందని తెలిపారు. కొతరాష్ట్రంలో చాలా సమస్యలున్నాయని వాటిని క్రమంగా పరిష్కరిస్తున్నామన్నారు.

ప్రభుత్వం ఏర్పడ్డాక మూడు నెలలపాటు ఆర్థిక అవసరాలను ఎలా భర్తీ చేసుకోవాలనే అంశంపై దృష్టి పెట్టామని, ఫైనాన్స్ కమిషన్ కూడా తమ ప్రభుత్వం చేసిన పనులను అభినందించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షల మేరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు.

తెలంగాణ రాష్ట్రం మొదటి వార్షికోత్సవాన్ని పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రతినిధులు ముఖ్యమంత్రిని అభినందించారు. తెలంగాణ రాష్ట్రం ఏడాదిలోనే ఎన్నో సామాజిక కార్యక్రమాలను రూపొందించి అమలు చేసిందని, వాటర్ గ్రిడ్, ఫార్మాసిటీ, స్మార్ట్ సిటీ, వైఫై సిటీ వంటి కార్యక్రమాలు, గూగుల్ లాంటి అంతర్జాతీయ సంస్థలు ఇక్కడకు రావడం చాలా గొప్ప విజయాలని కొనియాడారు.

ప్రియాంకను మెడిసిన్ చదివిస్తాం: కెసిఆర్

తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆత్మత్యాగం చేసిన కానిస్టేబుల్ కిష్టయ్య కూతురు ప్రియాంక వైద్య విద్యకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. కిష్టయ్య భార్య పద్మావతి, కూతురు ప్రియాంక, కొడుకు రాహుల్‌లు శుక్రవారం మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు.

ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో 970 మార్కులు సాధించిన ప్రియాంకను ముఖ్యమంత్రి అభినందించారు. మెడిసిన్ చదవాలనే ప్రియాంక ఆకాంక్షను నెరవేరుస్తామని, పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతోనే చదివిస్తామని వారికి సీఎం భరోసా ఇచ్చారు. కరీంనగర్‌లో ఇల్లు కూడా కట్టిస్తామని, కిష్టయ్య కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఐఎస్‌బి విద్యార్థులతో కెసిఆర్

ఐఎస్‌బి విద్యార్థులతో కెసిఆర్

తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు అత్యంత సులభంగా, ప్రశాంతంగా వ్యాపారం చేసుకునేలా ప్రభుత్వం జూన్ 12న ఇండస్ట్రియల్ పాలసీ(టీఎస్ ఐపాస్)ని ప్రకటించనుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తెలిపారు.

టిఎస్ పాస్: ఐఎస్‌బి విద్యార్థులతో కెసిఆర్

టిఎస్ పాస్: ఐఎస్‌బి విద్యార్థులతో కెసిఆర్


ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు చెందిన 56 మంది ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రతినిధులతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శుక్రవారం జరిగిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు.

టిఎస్ పాస్: ఐఎస్‌బి విద్యార్థులతో కెసిఆర్

టిఎస్ పాస్: ఐఎస్‌బి విద్యార్థులతో కెసిఆర్

ప్రభుత్వం తెచ్చే పాలసీతో తెలంగాణ రాష్ర్టానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

 టిఎస్ పాస్: ఐఎస్‌బి విద్యార్థులతో కెసిఆర్

టిఎస్ పాస్: ఐఎస్‌బి విద్యార్థులతో కెసిఆర్


ఎలాంటి అడ్డంకులు లేకుండా సింగిల్ విండో విధానంలో అనుమతుల జారీ, ఆన్‌లైన్ దరఖాస్తు విధానం, దరఖాస్తుల పరిశీలనకు సీఎంవోలో చేజింగ్ సెల్, 10-12 రోజుల్లోనే దరఖాస్తుల ప్రాసెస్ పూర్తి చేసి, తన చేతుల మీదుగానే ప్యాకెట్ రూపంలో అన్ని అనుమతుల పత్రాలను అందించడం జరుగుతుందని కేసీఆర్ తెలిపారు.

ప్రియాంకకు సాయం

ప్రియాంకకు సాయం

తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆత్మత్యాగం చేసిన కానిస్టేబుల్ కిష్టయ్య కూతురు ప్రియాంక వైద్య విద్యకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+