హైదరాబాద్‌వాసులకు కేసీఆర్ వరాలు, 'కృష్ణా'పై కేంద్రం లాయర్‌పై సుప్రీం అగ్రహం
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గ్రేటర్ హైదరాబాద్‌వాసులపై వరాల జల్లు కురిపించారు. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయన నగరవాసుల పైన కరుణ చూపించారని చెప్పవచ్చు.
నగరంలోని విద్యుత్, నల్లా నీటి బకాయిలను మాఫీ చేయాలని నిర్ణయించారు. నగర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, అధికారులతో సీఎం కెసిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బకాయిలు రద్దు చేయాలని నిర్ణయించారు.
దీంతో, ఆరు లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.128 కోట్లు, మంచి నీటి బిల్లుల బకాయిలు రూ.290 కోట్ల వరకు ఉంటాయని ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఉత్తర్వులు తదుపరి జారీ చేయనన్నారు.

కృష్ణా జలాల రగడ: కేంద్రం లాయర్ పైన సుప్రీం ఆగ్రహం
కృష్ణా నది జలాల పంపిణీ పైన తదుపరి విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. దీనిపై తెలంగాణ తరఫున వైద్యనాథన్ తమ వాదనలు వినిపించారు. మొదటి నుంచి తెలంగాణ హక్కులను కాపాడలేదని, నీటి పంపకాలకు సంబంధించి వాదనలు వినాలని తెలంగాణ న్యాయవాది విజ్ఞప్తి చేశారు.
కృష్ణా జలాల పంపిణీ పైన కేంద్రం తన వైఖరి ఇప్పటి వరకు చెప్పకపోవడంపై సుప్రీం కోర్టు కేంద్రం తరఫు న్యాయవాదిపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు చెప్పకపోవడమేమిటని ప్రశ్నించింది. పదిహేను నిమిషాల్లో పూర్తి వివరాలు ముందుంచాలని చెప్పింది. న్యాయవాదిగా మీరు పని చేయడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది. అనంతరం విచారణను 8వ తేదీకి వాయిదా వేసింది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications