కూసుకుంట్లకు బీఫామ్ అందించిన కేసీఆర్: రూ. 40 లక్షల చెక్కు కూడా
హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్‌లో బీఫామ్ అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ నిధి నుంచి రూ. 40 లక్షల చెక్కును కూడా ఇచ్చారు.
తనకు అభ్యర్థిగా అవకాశమిచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. పోలింగ్ నవంబర్ 3న జరగనుంది. ఫలితాలు నవంబర్ 6న ప్రకటిస్తారు.
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ప్రకటించారు కేసీఆర్.
కాగా, మునుగోడు ఉపఎన్నికను బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే ఈ మూడు పార్టీలు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. తమదంటే తమ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే, నవంబర్ 6నే మునుగోడు ప్రజల తీర్పు తెలిసే అవకాశం ఉంది.
-
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications