స్టేషన్‌ఘన్ పూర్‌లో ఉపఎన్నిక, కేంద్రంలో హంగ్: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. వరంగల్, హన్మకొండలో రోడ్ షో నిర్వహించిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి చెందిందన్నారు. సీఎం రేవంత్ అర్తం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని.. వరంగల్ జిల్లాకి కాళేశ్వరం ప్రాజెక్టుతో కాకుంటే నీళ్లేలా వచ్చాయని ప్రశ్నించారు.
మరోవైపు, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. 'ఇక్కడ ఒక మనిషికి టికెట్ ఇచ్చాం. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాం. ఇప్పుడు ఎందుకు పార్టీ మారిపోయిండు. ఎందుకోసం మారిండు పార్టీ ? కడియం శ్రీహరి చేసిన మోసానికి శాశ్వతంగా రాజకీయ జీవితాన్ని సమాధి చేసుకున్నడు అని కేసీఆర్ మండిపడ్డారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఇంకో మూడునెలల్లో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాక తప్పదు. మన రాజయ్య ఎమ్మెల్యే కాక తప్పదు. మీరు రాసిపెట్టండి. నేను చెబుతున్న జరుగబోయేది సత్యం. ఖచ్చితంగా మూడునెలల్లో ఉప ఎన్నిక రాక తప్పదు. ఇదే రాజయ్య ఎమ్మెల్యే కాక తప్పదు. ద్రోహులకు చెప్పే గుణపాఠం అదేనంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రతిపక్షంపైనే విమర్శలు చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. జైల్లో వేస్తామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. జైళ్లకు తోకమట్టకు నేను భయపడుతనా? కేసీఆర్ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా? ఎన్ని దెబ్బలు తిన్నం. ఎన్ని నిరాహార దీక్షలు చేశాం. ఎన్ని రాజీనామాలు చేశాం. ఎన్నిసార్లు పదవులను ఎడమకాలి చెప్పులా విసిరేసినం.అలా భయపడితే తెలంగాణ వచ్చేదా?' కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చి ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని కేసీఆర్ విమర్శించారు. అడ్డగోలు హామీలిచ్చి అమలు చేయకుండా రైతులు, ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలవాలన్నారు. ;eర్లమెంట్ ఎన్నికల్లో హంగ్ రాబోతుందని.. అందులో బీఆర్‌ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించబోతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. 'ఈ రోజు ప్రచారం డంబాచారం. నరేంద్ర మోడీకి కూడా 200 సీట్లు దాటే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ 14-15 ఎంపీలు గెలిస్తే.. కేంద్రంలోని హంగ్ పార్లమెంట్ వస్తే కీలకమైన పాత్ర పోషించే అవకాశం తెలంగాణకు ఈ రోజు ఉంది. తెలంగాణ హక్కుల కోసం పోరాడాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications