కేటీఆర్ కు కేసీఆర్ షాక్ - హరీష్ కు కీలక బాధ్యతలు..!!

బీఆర్ఎస్ ప్రక్షాళన దిశగా కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తరువాత పార్లమెంట్ ఎన్నికల్లోనూ భారీ ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్, బీజేపీ ఎనిమిది స్థానాలు చొప్పున గెలిచాయి. కేసీఆర్ సొంత జిల్లా మెదక్ లోనూ బీఆర్ఎస్ కు కలిసి రాలేదు. ఇక త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. పార్టీ కేడర్ పూర్తిగా నిరుత్సాహంలో ఉంది. దీంతో..పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి మార్పు పైన కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్ కసరత్తు
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీఆర్‌ఎస్‌కు ప్రతికూలంగా రావడంతో గులాబీ బాస్‌ కేసీఆర్ నిరాశకు గురయ్యారు. బీఆర్‌ఎస్ నేతలకు ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి. దీంతో పార్టీలో కీలక పదవుల్లో మార్పులు చేయాలని కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పార్టీలో కీలక బాధ్యతల నుంచి మార్చాలని గులాబీ బాస్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ స్థానంలో కుటుంబంలోనే మరొకరికి కేటాయించాలా లేదా బయట వ్యక్తులకు అప్పగించాలా అనేదానిపై కేసీఆర్ సమాలోచనలు కొనసాగిస్తున్నారు.

KCR likely to announce new working president for BRS in place of KTR as reports

కేటీఆర్ స్థానంలో హరీష్
ఇందు కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు హరీష్‌రావు పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. హరీష్ కు అప్పగించినా కుటుంబ సభ్యులకే మరోసారి పదవి ఇచ్చారనే విమర్శలు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. దీంతో...హరీష్ తో పాటుగా ఎస్సీ, బీసీ సామాజికవర్గాల నుంచి ఎవరినైనా ఒకరిని ఎంపిక చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రానున్నది ఎన్నికల కాలం కావడంతో పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురాగలిగే నాయకులు ఎవరనేదానిపై గులాబి బాస్ ఫోకస్ చేశారట. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది.

KCR likely to announce new working president for BRS in place of KTR as reports

పార్టీలో జోష్ వచ్చేనా
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పార్టీ స్థానిక సంస్థల్లో బలపడే ప్రయత్నం చేస్తోంది. ఇందు కోసం కేటీఆర్ స్థానం హరీష్ కు అప్పగించాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరోవైపు హరీష్‌రావు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించేందుకు సానుకూలంగా లేనట్లు తెలుస్తోంది. కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగి హరీష్‌కు బాధ్యతలు అప్పగిస్తే అంగీకరించే అవకాశం ఉంటుంది. దీంతో..ఇప్పుడు కేసీఆర్ తీసుకొనే నిర్ణయాలతో జోష్ వస్తుందా అనే ఆశతో పార్టీ కేడర్ ఆసక్తిగా తుది నిర్ణయం కోసం వేచి చూస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+