Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాబుపై కేసు ఎన్నికల తర్వాత చూద్దాం, వెంకయ్యలా ప్రాసలు నాకూ వచ్చు: కెసిఆర్

హైదరాబాద్‌: జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజకీయ ప్రత్యర్థులకు చురకలు అంటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడినే కాకుండా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని కూడా ఆయన వదిలిపెట్టలేదు.

చంద్రబాబుపై ఆయన ఆసక్తికరమైన చేశారు. రాజ్యాంగం ప్రకారమే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుతో తమ స్నేహం కొనసాగుతుందని అన్నారు. చంద్రబాబుపై కేసు విషయాన్ని ఓ మీడియా ప్రశ్నించగా... జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత చూద్దామని కేసీఆర్‌ దాటవేశారు.

KCR made interesting comments on Chandrababu

కేంద్రం వ్యవహరించే తీరు తెలంగాణ ప్రజలను మనస్థాపానికి గురి చేస్తుందని ఆయన అన్నారు. కేంద్ర పక్షపాత వైఖరికి కూడా హద్దు ఉండాలని ఆయన అన్నారు. ఇప్పుడే అందిన వార్త.. దేశంలో 20 స్మార్ట్ సిటీలు ప్రకటిస్తే అందులో ఆంధ్రాకు రెండు ఇస్తే.. తెలంగాణకు ఒక్కటి కూడా లేదని ఆయన అన్నారు. దీనికి వెంకయ్యనాయుడు సమాధానం ఏం చెబుతారని ఆయన ప్రశ్నించారు.

KCR made interesting comments on Chandrababu

వెంకయ్యనాయుడి అంత్యప్రాసలు.. ఆది ప్రాసల గురించి అందరికీ తెలుసునని అన్నారు. వెంకయ్యనాయుడు లాగా తాను కూడా ప్రాసలతో మాట్లాడగలనని ఆయన వ్యంగ్యంగా అన్నారు. తెలుగు భాష తనకు చక్కగా వస్తుందని, చిల్లర ప్రచారాల ద్వారా కేసీఆర్‌పై పైచేయి సాధించాలనుకోవడం సరికాదని ముఖ్యమంత్రి అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+