ముఖ్య నేతలకు కేసీఆర్ పిలుపు, కీలక నిర్ణయం..!!
తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. అటు మున్సిపల్ ఎన్నికలకు ఈ రోజుతో నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ఇక ప్రచారం ఊపందుకోనుంది. ఈ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఇదే సమయంలో కేసీఆర్ కు ఫోన్ టాపింగ్ కేసులో నోటీసులు సంచలనంగా మారింది. కేసీఆర్ కు సమయం ఇచ్చేందుకు సెట్ అంగీకరించింది. కాగా, తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. పార్టీ కార్యాచరణ ఖరారు చేసారు. సిట్ నోటీసులతో పాటుగా.. మున్సిపల్ వ్యూహాలపైనా నిర్ణయం తీసుకున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీలోని ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఇప్పటికే ఫోన్ టాపింగ్ కేసు లో సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ రోజు విచారణకు రావాలని కోరగా.. కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల కారణంగా తనకు మరో రోజు నిర్ణయించాలని సూచించారు. నామినేషన్ల దాఖలుకు రేపే ఆఖరి రోజు. పలువురు అభ్యర్థులకు బీఫాంలు ఇవ్వాల్సి ఉందని చెప్పుకొచ్చారు. మరో రోజు విచారణకు పిలిస్తే తప్పకుండా హాజరవుతానని. విచారణ కోసం వేరే తేదీ నిర్ణయించలని కోరారు. అదే సమయంలో ఎర్రవల్లిలోని తన నివాసంలో విచారణ జరపాలని కోరుతున్నట్లు వివరించారు. భవిష్యత్ నోటీసులు ఎర్రవల్లి నివాసానికే పంపాలని సూచించారు. మాజీ ముఖ్యమంత్రిగా.. ఓ పార్టీకి అధినేతగా.. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, బాధ్యత గల పౌరుడిగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్ స్పష్టం చేసారు. దీంతో.. కేసీఆర్ అభ్యర్ధన మేరకు విచారణ తేదీ మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.

మున్సిపల్ ఎన్నికల పై నజర్
అయితే, ఎర్రవల్లిలో విచారణ చేయాలనే ప్రతిపాదన పైన ఇంకా నిర్ణయం తీసుకో లేదని తెలు స్తోంది. ఈ రోజు లేదా రేపు మరోసారి సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. పార్టీ నేతలు కేటీఆర్, జగదీశ్ రెడ్డి సహా పలువురు నేతలు కేసీఆర్ తో భేటీ అయ్యారు. సిట్ నోటీసులు మరో సారి ఇచ్చేందుకు కసరత్తు జరుగుతున్న వేళ.. దీని పైన పార్టీ ఏ విధంగా స్పందించాలనేది చర్చించినట్లు తెలుస్తోంది. ఇక.. పంచాయితీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పైన ప్రజల్లో ఉన్న ఆదరణ ఏంటో స్పష్టం అయిందని.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో మరింత కలిసి కట్టుగా పని చేయటం ద్వారా మెరుగైన ఫలితాలు సాధింవచ్చని కేసీఆర్ పేర్కొన్నారు. ఇందు కోసం ప్రతీ మున్సిపాల్టీ లోనూ ప్రచార తీరును సీనియర్లు పర్యవేక్షించేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచించారు. బీ ఫారాలు ఇవ్వటం మొదలు.. పోలింగ్ వరకు ప్రతీ చోట గెలుపే లక్ష్యంగా పని చేయాలని నిర్దేశించారు. కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత ఉందని.. ప్రజల్లో ఉన్న భావాలను అనుకూలంగా మలచుకోవాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications