రూ.6 వేలకే బంగ్లా కట్టినట్లు చేస్తున్నారు: నవ్వించిన కేసీఆర్
తనను కలిసేందుకు వచ్చిన వారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం నవ్వించారు.
హైదరాబాద్: తనను కలిసేందుకు వచ్చిన వారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం నవ్వించారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో సీఎం కేసీఆర్ ఈ రోజు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆశా వర్కర్ల వేతనాలను రూ.6 వేలకు పెంచుతున్నామని కేసీఆర్ ప్రకటించారు. దీంతో వారు హర్షం వ్యక్తం చేస్తూ.. జై కేసీఆర్ అంటూ చప్పట్లు కొట్టారు.

దీనిపై కేసీఆర్ వెంటనే స్పందించారు. 'వద్దు.. వద్దు.. అయిపాయే.. రూ.ఆరు వేలకే బంగ్లా కట్టినట్టు చేస్తున్నారు.. అలా కాదు కదా, మీరు.. నేను కోరే విధంగా.. మంచి తెలంగాణ ఆరోగ్య సంరక్షకులు కావాలి.. ఆరోగ్య సైన్యం కావాలి. ఎందుకంటే, మనం ముసలోళ్లం అయిపోతున్నాము ... రేపు పుట్టే పిల్లలు ఎంత బలంగా పెరిగితే, ఎంత మంచిగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. గొప్ప రాష్ట్రం తయారవుతుంది. అది చేయడంలో మీ పాత్ర ఇక్కడితే అయిపోదు. మీకు రూ.ఆరు వేల వరకే పెరుగుదల ఉండదని, మీకు మరోసారి మంచిగా పెంచుతానని హామీ ఇస్తున్నా' అని కేసీఆర్ అన్నారు. దీంతో ఆశా వర్కర్లు క్లాప్స్ కొడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications