కేసీఆర్‌కు పదవీ గండం: 'జ్యోతిష్యం సూచిస్తోంది'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావుకు పదవీ గండం ఉందని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఏ వార్తా ఛానల్ డిస్కషన్‌కు వెళ్లినా ఈ విషయం గురించి ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు.
2016 జూన్ నాటికి కే. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉండరని స్పష్టంగా చెబుతున్నారు. కే. చంద్రశేఖరరావుకు ఏదో అవుతందని తాను చెప్పడం లేదని, అయితే తన పదవిని ఎవరో ఒకరికి అప్పగించాల్సిన పరిస్ధితి వస్తుందని, ఈ విషయాన్ని జ్యోతిష్యం సూచిస్తోందని అంటున్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగననే కోణంలో కే. చంద్రశేఖరరావు పలుమార్లు అన్నారని ప్రస్తావిస్తున్నారు. గతంలో మాజీ డిప్యూడీ సీఎం రాజయ్యను తొలగించి సందర్భంలో కూడా కేసీఆర్ 15 నెలల ఒక్కరోజు మాత్రమే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని కొత్తకోట దయాకర్ రెడ్డి జోస్యం చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications